ప్రభుత్వ పాఠశాలలో అరకొరగా అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం

Published: Wednesday February 09, 2022

 శేరిలింగంపల్లి -ప్రజా పాలన /న్యూస్ :7వ రోజు బస్తీ బాట కార్యక్రమంలో అంజయ్య నగర్ లో స్థానిక నాయకులు ప్రజలతో కలిసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్ గారు పర్యటించడం జరిగింది. బస్తి పర్యటన అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన కమ్యూనిటీ హాల్ స్థలంలో అసాంఘిక కార్యక్రమాలుతో పాటు కొంతమంది టిఆర్ఎస్ నాయకులు వ్యాపార నిమిత్తం గుడిసెలు వేసి అద్దెలు వసూలు చేస్తూ స్థిరంగా నివాసముంటున్నారు దీనిపై ఎవరు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆవేదన. అదేవిధంగా విచ్చలవిడిగా పట్టపగలు బెల్టు షాపులు పెట్టి వ్యాపారం చేస్తున్నా స్థానిక ఎక్సైజ్ అధికారులు గాని నాయకులు గానీ పట్టించుకునే పాపాన పోవడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, గత ప్రభుత్వ హయాంలో పిల్లల కోసం కేటాయించిన అంగన్వాడీ కార్యాలయ స్థలంలో ఇంతవరకు కార్యాలయాన్ని నిర్మించకుండా కబ్జా గురవుతున్న మిన్నకుండిపోయిన ప్రభుత్వఅధికారుల తీరు వారి నిర్లక్ష వైఖరికి నిదర్శనం. అదేవిధంగా చెత్తాచెదారం, పొంగి పొర్లుతున్న డ్రైనేజీ, స్మశాన వాటిక కు సరైన రోడ్డు మార్గం లేక స్థానికులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు, సిసి రోడ్స్ అనేక సమస్యలు అంజయ్య నగర్ బస్తీలో నెలకొన్నాయి..  మరీ ముఖ్యంగా పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థుల పరిస్థితి అయోమయంగా ఉంది చాలీచాలని తరగతి గదులు, త్రాగడానికి మంచినీటి సౌకర్యం లేక రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో పందికొక్కుల్లా గా మధ్యవర్తులు లబ్ధి పొందుతూ విద్యార్థులకు సరైన పౌష్టికాహారాన్ని అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని రవి కుమార్ యాదవ్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇట్టి సమస్యపై సత్వరమే సంబంధిత అధికారులను కలిసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని బస్తీవాసులకు హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ లో చేరిన వారు రాంరెడ్డి, దుర్గారావు, స్థానిక నాయకులు ఆంజనేయులు సాగర్, చంద్ర శేఖర్ యాదవ్, మన్యంకొండ, రవీందర్ సాగర్, వెంకటరమణ, సంతోష్ గుప్తా, చెన్నయ్య, వెంకట్ నాయక్, రవి నాయక్, భాస్కర్ రెడ్డి, మేరీ, రేఖ, సంతోష, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు