కంటివెలుగు ప్రోగ్రాం విజయవంతం చేద్దాం*

Published: Friday January 06, 2023
క్షయవ్యాధిపై సర్వే చేయండిఆశ డే కార్యక్రమంలో డా.  బిఎస్ పృథ్విరాజ్ నాయక్ మధిర రూరల్ జనవరి 5 ప్రజా పాలన ప్రతినిధిమండల పరిధిలో పిహెచ్సి దెందుకూరు వైద్యులు డా. బిఎస్ పృథ్వి రాజ్ నాయక్ ఆధ్వర్యంలో  వివిధ పారా మెడికల్ సిబ్బంది మరియు వివిధ గ్రామాల ఆశ కార్యకర్తల కు ప్రతి నెల 5వ తారీకున జరిగే ఆశ డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు కార్యక్రమంలో పిల్లలలో విజ్రుంబిస్తున్న క్షయవ్యాధిని నివారించాలి అని, ప్రతి ఒక్కరు ఇంటింటికి తిరిగి క్షయవ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి తెమడ పరీక్షల కోసం స్ఫూటo కప్స్ ఇచ్చి పిహెచ్సికీ టెస్టింగ్ కోసం పంపించాలి అని, అదే విధంగా కంటి వెలుగు ప్రోగ్రాం ను ముందుగా ఇంటింటికి ప్రచారం చేయాలి అని, ఈ నెల 18 నుండి ఈ కార్యక్రమం మండలంలో తేదీల వారీగా ప్రతి గ్రామం, పట్టణములో జరుగుతుంది అని తెలియపరుస్తూ పలు ఆరోగ్యపధకాలు గురించి డా. పృథ్విరాజ్ నాయక్ వివరించారు.ఈ కార్యక్రమంలో పిహెచ్సి ఆరోగ్యం సిబ్బంది పిహెచ్ఎన్ గోలి రమాదేవి, హెచ్ఇఒ సనప  గోవింద్, పిహెచ్ఎన్ పద్మావతి  హెచ్ఎస్ సుబ్బలక్ష్మి హెచ్ఎస్ కొండయ్య హెచ్వి కౌసెల్య  ఎఎన్ఎమ్ లు వి విజయకుమారి, జయమ్మ  భారతి, లక్ష్మి, లీల, రాజేశ్వరి నాగమణి, విజయలక్ష్మి విజయ, అరుణ హెచ్ఎ లు శ్రీనివాస్, నాగేశ్వరావు పిహెచ్సి స్టాఫ్ ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.