గోపాలమిత్ర పశు వైద్య శిబిరం విజయవంతం

Published: Friday December 23, 2022
బోనకల్, డిసెంబర్ 22 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని రాయనపేట గ్రామంలో గురువారం గోపాలమిత్ర పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ కిన్నెరవాణి ప్రారంభించారు. బోనకల్ పశు వైద్యాధికారి డాక్టర్ నాగేశ్వరరావు పాల్గొని 23 పశువులకు గర్భకోశ వ్యాధులకు చికిత్స అందించారు. 17 శాల్తిలకు సాధారణ వైద్యం అందించారు. లేగ దూడలకు 28 శాల్తీ లకు నత్తల నివారణ మందు తాగించారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ పశువులకు సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించి టీకాలు వేయించుకోవాలని, పడ్డలకు,పెయ్యలకు ఖనిజ లవణము ఇవ్వటం వలన త్వరగా గర్భం ఎదిగి పశువులు ఎదకు వస్తాయని, చలికాలంలో నల్లజాతి పశువులకు కృత్రిమ గర్భాధారణ ఇంజక్షన్ వేయించడం వలన ఏ విధమైన గర్భకోశ వ్యాధులు రాకుండా ఉంటాయని తెలియజేశారు. ఈ శిబిరంలో గ్రామ పెద్దలు బొమ్మినేని హనుమంతరావు, గోపాలమిత్ర సూపర్వైజర్ మోత్కూరి వెంకటేశ్వరరావు, గ్రామ పెద్దలు టి అశోక్, పశు వైద్య సిబ్బంది, స్థానిక గోపాలమిత్ర ఎం నాగేశ్వరరావు పాల్గొన్నారు.