అయ్యప్ప స్వామి ఆలయంలో అన్నదానం **

Published: Thursday March 30, 2023
ఆసిఫాబాద్ జిల్లా మార్చి29(ప్రజాపాలన, ప్రతినిధి) :అసిఫాబాద్ పట్టణంలోని శ్రీ హరి హరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం ఆలయ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు ఆలయ ప్రధాన అర్చకులు నాగేష్ శర్మ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు వేణుగోపాల్, వెంకట్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ (ఏఎంసీ) గాదేవేని మల్లేష్, వ్యవస్థాపక అధ్యక్షుడు కాండ్రే కిషన్, సభ్యులు సంతోష్ శ్యామ్, చంద్రమోహన్, విశాల్, వినాయక్, బాల రాము, బట్టుపెల్లి సంతోష్, పత్తి శ్యామ్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.