అధిక వడ్డీలకు డబ్బులు వసూలు చేస్తున్న వారిపై కేస్ నమోదు చేసిన కోరుట్ల పోలీసులు

Published: Tuesday June 28, 2022

కోరుట్ల, జూన్ 27 (ప్రజాపాలన ప్రతినిధి):
కథలాపూర్ మండలం తాండ్రియాల కు చెందిన మామిడిపల్లి తిరుపతి, రమ భార్యా భర్తలు ప్రజల అవసరాల నిమిత్తం వడ్డీ కి ఇస్తూ, వారిని వేధిస్తూ అధిక వడ్డీ 10% నుండి 30% వరకు అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారని సమాచారం తో కోరుట్ల సీఐ రాజశేఖర్ రాజు ఆద్వర్యం లో పోలీసులు వారి ఇంటిపై దాడి చేయగా, వారి వద్ద నుండి సుమారు ₹ 1 కోటి 30 లక్షల రూపాయల విలువగల ప్రాంసరీ నోట్లు, పలు బ్యాంక్ లకు చెందిన బ్లాంక్ చెక్కులు, బాండ్ పేపర్లు,15 తులాల బంగారు ఆభరణాలు, ఖాతా బుక్కు లు, స్వాధీనం చేసుకొని కేస్ నమోదు చేశారు. ఈ సందర్భంగా కోరుట్ల సీఐ రాజశేఖర్ రాజు మాట్లాడుతూ ప్రజలు వారి అవసరాల నిమిత్తం, నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వడ్డీ ఇస్తూ వ్యాపారులు వారిని వేధిస్తూ అధిక వడ్డీ లు వసూలు చేస్తు, వారిని మరింత అప్పుల ఊబి లోకి లాగుతున్నరని, ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకొంటామని ఆయన హెచ్చరించారు.ఈ సమావేశం లో కోరుట్ల ఎస్సై లు సతీష్, శ్యామ్ రాజ్, కథలాపూర్ ఎస్సై రజిత, పొలీస్ సిబ్బంది పురుషోత్తం, మదన్ లాల్, కీర్తి లు పాల్గొన్నారు