కేశవపట్నం లో రోడ్డు పైనే నిర్వహిస్తున్న వార సంత

Published: Tuesday October 18, 2022

శంకరపట్నం అక్టోబర్ 17 ప్రజాపాలన: కేశవపట్నంబస్టాండ్ఇ  ఎదురుగా గల ప్రధాన రహదారికి ఇరువైపూల కురగాయలు విక్రయిస్తున్నారు ఈ మండల కేంద్రంలో ప్రతి సోమవారము నాడు నిర్వహించే వారసంత కు బస్టాండ్ వెనుక గల స్థలములో వారసంత నిర్వాహణ కోసం లక్షలు వెచ్చించి నిర్మించిన గదులు మరియు కురగాయాల విక్రయం కోసం ఏర్పాటు చేసిన గదులు నిరుపయోగముగా మారాయి. ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసి నిర్మించిన కూడ వాటిని వాడుకోలేక పోతున్నారు. నిర్వాహకుల నిర్లక్ష్యం తో కురగాయల అమ్మకం రోడ్డుపైన చెయ్యడం వల్ల కరీంనగర్ వరంగల్ ప్రదాన రాహదారి అయినటువంటి రోడ్డుకి ఇరువైపులా జనసముహలతో రోడ్డు కిక్కిరిసి వాహన చోదకులకు ఇబ్బంది కలుగజేయుచున్నారు. మరియు ఆది బస్టాండ్ కూడలి కావటంతో బస్సుల రాక పోకలకు ఏర్పడుచు ప్రజలకు ఇబ్బందికరముగా మారింది ఇప్పటికైనా వారసంత నిర్వాహకులు తక్షణమే స్పందించి ఈయొక్క సమస్యను పరిష్కరిం చాలని చుట్టుపక్కల గ్రామ రైతులు ప్రజలు కోరుతున్నారు