విద్యాసంస్థలు బందును జయప్రదం చేయండి

Published: Wednesday July 20, 2022
జన్నారం, జూలై 18, ప్రజాపాలన: ఈనెల 20వ తారీకు జరిగే విద్యాసంస్థల బందుకు జయప్రదం చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు పాఠశాల కళాశాల విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో ఏఐఎస్ఎఫ్ మంచిర్యాల జిల్లా సహాయ కార్యదర్శి సయిద్ సోమవారం అన్నారు, ఈ సందర్భంగా ఎర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ నెల రోజులు గడుస్తున్న కనీస మౌలిక వసతులు కల్పించలేదని విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందించలేదని దృసితి  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు, ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని .మధ్యాహ్న భోజనం పథకాన్ని నిధులను పెంచి నాణ్యమైన భోజనం అందించాలన్నారు, రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను విద్యారంగం పై నిర్లక్ష్యం వైకిరిని అవలంబిస్తున్నందని వారన్నారు,  విద్యార్థుల బస్సు పాసుల ధరలను విపరీతంగా పెంచడం వలన పేద మధ్య తరగతి విద్యార్థులకు ఉన్నత చదువులు చదవడం  భారంగా మారిందన్నారు, పెండింగులో ఉన్న స్కాలర్షిపులు, రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వలన      మధ్యతరగతి విద్యార్థులకు చదువుకోవడం భారంగా మారింది తక్షణమే విద్యారంగ సమస్యలను పరిష్కరించాలన్నారు, మధ్యతరగతి విద్యార్థులు ఆదుకోవాలని లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అస్లం హేమంత్, ఏజాస్, సాహెల్ కామ్రాన్, తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area