ఎస్ టి రిజర్వేషన్ 9.08 శాతం అన్ని రంగాలలో అమలు చేయాలి

Published: Thursday May 19, 2022
మంచిర్యాల టౌన్, మే 18, ప్రజాపాలన : ఎస్ టి రిజర్వేషన్ 9.08 శాతం అన్ని రంగాలలో అమలు చేయాలని, రాష్ట్ర ఎస్టి మోర్చా పిలుపు మేరకు మంచిర్యాల పట్టణ ఎస్టి మోర్చా అధ్యక్షుడు కాండ్రకొండ నాగరాజు ఆధ్వర్యంలో రాజ్యాంగపరమైన హక్కు దామాషా ప్రకారం ఎస్ టి లకు 9 .08 శాతం అన్ని రంగాలలో రాష్ట్రప్రభుత్వం వాట కల్పించి అమలు చేయాలని, స్థానిక తాసిల్దార్ కు  బుదవారం రోజున వినతి పత్రం ఇవ్వడం జరిగింది .
ఈ కార్యక్రమంలో ఎస్టి మోర్చా జిల్లా నాయకుడు దాస్య నాయక్, మంచిర్యాల పట్టణ బిజెపి అధ్యక్షుడు వంగపల్లి వెంకటేశ్వర రావు, వైస్ ప్రెసిడెంట్ కూచడి సతీష్, చిప్పరి రాజ మల్లయ్య , కొండవీటి వేణు, కార్యదర్శి సూరి, ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి  నాగుల రాజన్న, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముదాం మల్లేష్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు జోగుల శ్రీదేవి, పట్టణ అధ్యక్షురాలు పచ్చ స్వప్న రాణి, పట్టణ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు అర్ణకొండ  శ్రీనివాస్,  తదితరులు పాల్గొన్నారు