వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి : మాజీ ఎంపీ వివేక్ వెంకట్ స్వామి

Published: Monday July 26, 2021

మంచిర్యాల బ్యూరో, జులై 25, ప్రజాపాలన ప్రతినిధి : మంచిర్యాల పట్టణంలో వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాల నిమాజీ ఎంపీ వివేక్ వెంకట్ స్వామి డిమాండ్ చేశారు. ఆదివారం రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో  పట్టణంలో ని వరద బాదితులకు నిత్యవసర సరుకుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో అధిక వర్షాలు వలన ఎన్టీఆర్ కాలనికి వరదలు వచ్చి ఇళ్లలోకి నీరు వచ్చి నష్టపోయిన 100 బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకుల అందజేయడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపి మాట్లాడుతూ రాష్ట్రం లో అధిక వర్షాలు కురుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ముందాస్తు చర్యలు తీసుకోకపోవడం తో  పట్టణం వాసులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు ఎలాంటి అపద వచ్చిన సేవ కార్యక్రమాలు చేయడానికి బిజెపి ముందు ఉంటుందని తెలిపారు. వరదల వలన నష్టపోయిన ప్రతి ఒక్కరికీ నష్ట పరిహారం చెల్లించాలని, లోతట్టు ప్రాంత పేద ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వంగపల్లి వెంకటేశ్వర రావు, బొయిని హరికృష్ణ, గాజుల ప్రభాకర్, పోనుగోటి రంగ రావు, రజినిష్ జైన్, పట్టి వెంకట కృష్ణ, తుల ఆంజనేయులు, రాచకొండ సత్యనారాయణ, అమిరిషెట్టి రాజు, పచ్చ వెంకటేశ్వర్లు, దయాకర్, తరుణ్, సతీష్ మరియు తతిదరులు పాల్గొన్నారు.