పసుర గ్రూప్స్ ఆఫ్ చైర్మన్ పబ్బతి వెంకట మోహన్ మృతి పట్ల సంతాపం

Published: Tuesday May 04, 2021

మధిర, మే 3, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో ప్రజల మనిషి ప్రజాసేవకు అంకితమైన మనిషి ఇంకా మధిర నియోజకవర్గం పరిధిలో ఎంతోమంది ప్రజలకు దగ్గర అయిన మనిషి ఆయన మృతి నియోజకవర్గంలో జీర్ణించుకోలేకపోతున్నాంమంది పేద బలహీన వర్గాల ప్రజలకు, విద్యార్థులకు కులాలకు అతీతం గా చేయూత ను ఇచ్చిన పబ్బతి మోహన్ గారికి అన్ని వర్గాల రాజకీయ నాయకులు, ప్రజలు సంగీభావం తెలుపుతున్నారు. వ్యాపార వేత్త గా అత్యున్నత స్థాయి లో ఉన్నప్పటికీ తన స్వగ్రామం మధిర ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో ప్రజలకు ఏదో ఒక సేవ కార్యక్రమాలు చేస్తూ అటు ఆధ్యాత్మిక భావన తో పలు ఆలయాల నిర్మాణానికి తన సాయం అందిస్తూ ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి రోజున దాదాపు పదివేల మంది కి అన్నదానం నిర్వహించి అలాగే ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి దేవాలయంలో మూడు నెలలు అయ్యప్ప స్వాములకు అన్నదానం నిర్వహించేవారు అలాగే కరోనా టైములో ఎంతోమంది ప్రజలకు సహాయ సహకారాలు అందించి ఎంతోమంది పేద విద్యార్థులకు చదువులు చెప్పించి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కానీ ఆయన అకాల మరణం మధిర ప్రజానీకం షాక్ కు గురిచేసింది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఆయన సేవలను మధిర ప్రజలు మరువలేనివి అని అన్ని రకాల రాజకీయ నాయకులు, వ్యాపార వేత్త లు, పురప్రముకులు, ప్రజలు తెలిపారు. వీరిలో మధిర mla బట్టి విక్రమార్క, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్, వాసిరెడ్డి రామనాదంరంగిశెట్టి కోటేశ్వరరావు, సూరం శెట్టి కిషోర్, మిరియాల రమణ గుప్తా, పాటిబండ్ల సత్యంబాబు, మేళం శ్రీనివాస్ యాదవ్, మొండితోక జయకర్, మొండితోక సుధాకర్ మధిర మునిసిపల్ చైర్పర్సన్ మొండితోక లత, మాజీ మునిసిపల్ చైర్పర్సన్ నాగరాణి, మల్లది హనుమంత రావు, కట్ట గాంధీ, శీలం నరసింహారావు, బెజవాడ రవి, మండదపు నాగేశ్వరరావు, జవ్వజి ఆనందరావు, పాపట్ల రమేష్, ఆర్య వైస్యులు: రంగ హనుమంతరావు, కురువెళ్ల కృష్ణ, విశ్వనాధం, రంగా దేవిశెట్టికపిలవాయి జగన్మోహన్, పల్లపోతు ప్రసాద్, మిరియాల కాశీ, ఇరుకుల్ల బాలకోటి, లక్మి నరసింహారావు, రంగ అప్పారావు, రంగ వెంకటేశ్వరరావు, అప్పారావు, ఇరుకుళ్ల రాధాకృష్ణ, చిరువ్యాపారుల సంఘము అధ్యక్షుడు పసుపులేటి నాగేంద్రశ్రీనివాసరావు, trs నాయకులు కనుమూరి వెంకటేశ్వరావు అంజన బాబు నారాయణ రావు శీలం వెంకట్రెడ్డి మరియు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.