పెండింగ్ మ్యుటేషన్ పై ప్రభుత్వ కొత్త ఆదేశాలు

Published: Thursday January 21, 2021

ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార్ బి సైదులు వెల్లడి

గతంలో పాత పద్ధతిలో భూముల రిజిస్ట్రేషన్ చేసుకుని  మ్యుటేషన్ కాని వారు ప్రభుత్వం సూచించిన విధంగా ధరణి వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, మధిర తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార్ సైదులు తెలిపారు . బుధవారం నూతన విధానం ద్వారా పాస్ బుక్ పొందిన లబ్ధిదారునికి ధ్రువీకరణ కాపీని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో పాత పద్ధతి న భూములను రిజిస్ట్రేషన్ చేయించుకుని   మ్యుటేషన్ కాని వారు వారి వివరాలను ధరణి వెబ్సైట్ ద్వారా మీసేవ లేదా ఆన్లైన్లో *పెండింగ్   మ్యుటేషన్* ద్వారా రిజిస్ట్రేషన్ వివరాలను పొందుపరిచాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. వీటిని జిల్లా కలెక్టర్ పరిశీలించి రికార్డులను విచారించి తదనుగుణంగా లబ్ధిదారునికి.   మ్యుటేషన్ చేసుకునేందుకు వీలుగా ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందించడం జరుగుతుందని తాసిల్దార్ తెలిపారు .సదరు సమాచారంతో కొనుగోలు చేసిన లబ్ధిదారులు మీ సేవ ద్వారా తిరిగి దరఖాస్తు చేసుకుంటే స్లాట్ బుకింగ్ మేరకు ఈ ప్రక్రియను పూర్తి చేసి లబ్ధిదారునికి పాస్బుక్కులు అందించడం జరుగుతుందని తాసిల్దార్ తెలిపారు. ఈ ప్రక్రియకు సంబంధించి భూమి   కొనుగోలు చేసిన లబ్ధిదారులు వారి  రిజిస్ట్రేషన్ చేసిన పత్రాలు ఆధార్ కార్డు ను వెంట తీసుకొని తాసిల్దార్ కార్యాలయానికి రావాల్సి ఉంటుందని తాసిల్దార్ డి. సైదులు తెలిపారు.