కెసిఆర్ విజన్ కలిగిన వ్యక్తి కాబట్టే కార్యక్రమాలన్ని అమలు చేస్తున్నాడు మంత్రి సబితా ఇంద్ర

Published: Saturday September 24, 2022
బెల్లంపల్లి సెప్టెంబర్ 23 ప్రజా పాలన ప్రతినిధి: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావ్ ఒక విజన్ కలిగిన, విజన్ తో పని చేసే వ్యక్తి కాబట్టే ఏ రాష్ట్రంలో చేయలేని విధంగా ప్రజా ఉపయోగ కార్యక్రమాలు తీసుకొని అన్నింటినీ సమర్థవంతంగా అమలు చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
శుక్రవారం బెల్లంపల్లి నియోజకవర్గం లోని తాండూర్, బెల్లంపల్లి, పట్టణాలలో నిర్మించన వివిధ కళాశాలల భవనాలకు, హాస్టల్ భవనాలకు, ఆమె ప్రారంభోత్సవం చేశారు, ఈ సందర్భంగా స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముందు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.
రాష్ట్రంలో ప్రజలకు ఏది అత్యవసరమో, అలాంటి రైతుబంధు, కళ్యాణ లక్ష్మి, కెసిఆర్ కిట్టు, వృద్ధాప్య,  వితంతు,  ఒంటరి మహిళ, వికలాంగుల పెన్షన్లు,వంటి ప్రజోప యోగ కార్యక్రమాలతో పాటు, కులవృత్తుల వారికి ఆర్థికంగా చేయూతనిస్తూ 70 నుండి 80 వరకు కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి  దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎవరు లేరని  అన్నారు. విద్యాపరంగా రాష్ట్రంలో 7223 కోట్ల నిధులతో 26,500 పాఠశాల భవనాలు నిర్మించామని, అందులో మంచిర్యాల జిల్లాలోనే 248 పాఠశాలలకు  48 కోట్ల 48 లక్షలతో బాగు చేయిస్తున్నామని, 7వేల కోట్లతో మన ఊరు, మనబడి పథకాన్ని కొనసాగిస్తున్నామని ఆమె తెలిపారు, ఏడు కోట్లతో మోడల్ స్కూల్స్, కస్తూరిబా పాఠశాలలు నిర్మించి ప్రారంభించామని, తెలంగాణ వాళ్లు ఎక్కడికెళ్లినా తలెత్తుకుని బతికేలా కేసీఆర్ ఆలోచిస్తున్నారని అన్నారు.
 ఆయన ప్రవేశపెట్టిన మోడల్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్ పాఠశాలలు, కాలేజీలు, ఇప్పుడిప్పుడే ఫలితాలు ఇస్తున్నాయని, రానున్న రోజుల్లో విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుని, ఉన్నత ఉద్యోగాలు పొందే అవకాశాలున్నాయని ఆమె అన్నారు.
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు కూడా సమర్థవంతంగా ఉండేందుకు మన ఊరు, మనబడి కార్యక్రమాన్ని తీసుకున్నారని, పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వంతోపాటు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు, ప్రతి ఒక్కరు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. స్థానిక
 సోషల్ వెల్ఫేర్ పాఠశాల ప్రిన్సిపాల్ సైదులు ను ఉత్తమ ఫలితాలు సాధించి, దేశస్థాయిలో ఏర్పాటుచేసిన యూనివర్సిటీలలో పలువురు విద్యార్థులు సీట్లు పొందినందుకుగాను ఆయనని  శాలువాతో సన్మానించారు.
అనంతరం పలువురు మహిళలకు బతుకమ్మ చీరలను, వృద్ధులకు పెన్షన్ కార్డులను అందించారు.
ఈ కార్యక్రమంలో, శ్రీధర్ రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తామ్ రెడ్డి, జిల్లా కలెక్టర్  భారతి హోలీ కేరి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ టి, సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, రేని కుంట్ల ప్రవీణ్, మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బి, సుదర్శన్,  ఆర్డీవో శ్యామలాదేవి, ఎమ్మార్వో కుమారస్వామి, స్థానిక కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, తెరాస నాయకులు, కార్యకర్తలు, విద్యాశాఖ అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.