పులిమద్ది ప్రాథమిక పాఠశాలలో బతుకమ్మ సంబరాలు

Published: Wednesday October 06, 2021
వికారాబాద్ బ్యూరో 05 అక్టోబర్ ప్రజాపాలన : బతుకునిచ్చే బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. మంగళవారం వికారాబాద్ మండల పరిధిలోని పులుమద్ది గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో ప్రధానోపాధ్యాయురాలు సువర్ణ ఆధ్వర్యంలో బతుకమ్మను పేర్చి ఆడిపాడారు. తీరొక్క పువ్వులతో బంతి చామంతి గునుగు తంగేడు రుద్రాక్ష వరహాలు కలువలతో విద్యార్థులు ఉపాధ్యాయులు అందరు కలిసి బతుకమ్మను అందంగా తీర్చిదిద్దారు. అనంతరం పాఠశాల ఆవరణలో బతుకమ్మ చుట్టూ కోలాటం విన్యాసంతో ఆడిపాడారు. ఆటపాటలతో ప్రాథమిక పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో పులుమద్ది గ్రామ సర్పంచ్ తిమ్మాపురం మాధవరెడ్డి ఉపాధ్యాయులు ఉమారాణి శ్రీలత నాగరాణి సంగీత కవిత రేణుక తదితరులు పాల్గొన్నారు.