ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 20 ప్రజాపాలన ప్రతినిధి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల లో సంతోష్ కుమార్

Published: Monday November 21, 2022

తెలంగాణ రాష్ట్రంలోని  మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా అభ్యర్థిగా అయినేని.సంతోష్ కుమార్ ను ప్రకటిస్తున్నాం. వారు అధ్యాపకుల సమస్యల పరిష్కారం కోసం కొన్ని సంవత్సరాలుగా నిరంతరంగా పని చేస్తున్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఇప్పటికీ గేలిసిన ఎమ్మెల్సీలు ఏమి చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారో అర్థం కాని పరిస్థితి. కొన్ని సంవత్సరాలుగా ప్రైవేట్ విద్య సంస్థలలో పని చేస్తున్న ఉపాధ్యాయులు అధ్యాపకులందరూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు,వారి సమస్యలని కనీసం పట్టించుకొనే నాధుడు లేక పోవడం. కరోనా పరిస్థితిలో ఎంతో మంది అధ్యాపకులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న  కనీసం కనికరించ లేదు. ఏ ఒక్కరూ మాట్లాడ లేదు. ఇప్పటికీ ప్రైవేట్ ఉన్నత విద్యసంస్థలలో(ఇంజనీరింగ్, ఫార్మసీ, పాలిటెక్నిక్, ఎంబీఏ, ఎంసిఏ..) అధ్యాపకులు,పాఠశాల ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. విద్య సంస్థలలో యాజమాన్యాలు పని దినాలు, సమయపాలన పాటించారు. ప్రైవేట్ పాఠశాలలో, జూనియర్ కాలేజ్ లో పనిచేస్తున్న ఉద్యోగులనీ వివిధ పనులతో వారిని శ్రమ దోపిడీకి గురిచేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల, జూనియర్ కాలేజ్ లెక్చరర్స్, పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్స్, అయ యూనివర్సిటీ(JNTUH/OU/PU/PSTU/BRAOU/PJTSAU...) అధ్యాపకుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాననీ  తెలియజేస్తున్నాను. విద్య వ్యవస్థ మార్పు కోసం,ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను.
రాబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులు సహకారం ఉండాలని,ప్రతి ఒక్కరూ మీ యొక్క ఓటును నమోదు చేసుకోవాలని కోరుతున్నాను.
ఈ కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.
మీ శ్రేయోభిలాషి అయినేని.సంతోష్ కుమార్ రాష్ట్ర అధ్యక్షులు -TSTCEA
దాసరి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి  బి.అనంత రామ్ ప్రధాన కార్యదర్శి కె రాజు కార్యదర్శి