యంగ్ మెన్ సెవెన్ సీటర్ ఆటో అసోసియేషన్ ను ఏఐటీయుసీలో కలపవద్దు

Published: Saturday November 26, 2022
మేడిపల్లి, నవంబర్ 25 (ప్రజాపాలన ప్రతినిధి)
 యంగ్ మెన్ సెవెన్ సీటర్ ఆటో అసోసియేషన్ ను ఏఐటీయుసీలో  కలపవద్దని అసోసియేషన్ మాజీ అధ్యక్షులు చిలుకల శ్రీనివాస్ యాదవ్,
పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి  యంగ్ మెన్ సెవెన్ సీటర్ ఆటో అసోసియేషన్ ను ఏర్పాటు చేసుకుని ఉప్పల్ నుండి ఎల్బీనగర్ వరకు ప్రయాణికులను చేరవేస్తున్నామని తెలిపారు. ఇటీవల అసోసియేషన్ లోని కొంతమంది సభ్యులు యంగ్ మెన్ సెవెన్ సీటర్ ఆటో అసోసియేషన్ను ఏఐటీయుసీలో  కలపడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. సెవెన్ సీటర్ ఆటో అసోసియేషన్ ను ఇతర యూనియన్ లో కలిపితే ఆటో అసోసియేషన్ కు సంబంధించిన పూర్తి హక్కులు వారి చేతుల్లోనికి వెళ్తాయని, ఆటో అసోసియేషన్ ను ఏ యూనియన్ లో కలపవద్దని తెలిపారు. 
ఏఐటీయుసీలో కలపడాన్ని వ్యతిరేకించే సెవెన్ సీటర్ ఆటో సభ్యులు మాజీ అధ్యక్షులు చిలుకల శ్రీనివాస్ యాదవ్,
మాజీ ఉపాధ్యక్షులు ఈదుల శ్రీను ముదిరాజ్, తోకల వెంకటేష్ యాదవ్,
ప్రధాన కార్యదర్శి రాచకొండ రమేష్ (చిట్టి), మాజీ సహాయ కార్యదర్శి ఎర్రజిల్లా భాస్కర్, మాజీ అర్గనైజర్ పందుల తిరుపతి, మాతంగి, అనిల్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మ లక్ష్మయ్య,
గంట వెంకట్ ముదిరాజ్,
నామ రహపతి, మహేందర్, కృష్ణ, గోవార్డెన్, మల్లెష్ యాదవ్, శ్రీను, మల్లయ్య, సైదులు, రాంబాబు, ప్రభకర్, గంగరాజ్, జి. శ్రీను తదితరులు ఉన్నారు.