అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిషేదం

Published: Monday February 14, 2022
జిల్లా ఎస్‌పి ఎన్.కోటి రెడ్డి ఐపిఎస్
వికారాబాద్ బ్యూరో 13 ఫిబ్రవరి ప్రజాపాలన : వికారాబాద్ జిల్లా యందు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున ముందస్తు అనుమతి లేకుండా మతపరమైన, రాజకీయపరమైన, ఇతర సంధార్భాలలో నిర్వహించే ర్యాలీలు, సభలు, సమావేశాలు, ప్రదర్శనలు జరుపుట నిషేధమని జిల్లా ఎస్పి ఎన్. కోటిరెడ్డి అన్నారు. ర్యాలీలు, సభలు, సమావేశాలకు తప్పనిసరిగా పోలీస్ అధికారుల దగ్గర అనుమతి తీసుకోవాలని సూచించారు. అనుమతి లేకుండా ఇట్టి కార్యక్రమాలను నిర్వహించే వారిపైన చట్టప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. పోలీస్ అధికారుల దగ్గర అనుమతి తీసుకోకుండా నిర్వహించే కార్యక్రమాలలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశాలు మెండుగా ఉంటాయని స్పష్టం చేశారు. పూర్తి భాద్యత ఆయా సభలు నిర్వహించిన సంబంధితులపై చట్టప్రకారం చర్య తీసుకోవడం జరుగునని వివరించారు. జిల్లా ప్రజలందరూ ఇట్టి విషయం పైన దృష్టి కేంద్రీకరించి అహర్నిశలు కష్టపడి శాంతిభద్రతలు కాపాడుతున్నటువంటి జిల్లా పోలీస్ అధికారులకు ఎల్లపుడూ సహకరించాలని జిల్లా ఎస్‌పి కోరారు.