రాష్ట్రస్థాయి విజార్డ్ పోటీలకు విద్యార్థుల ఎంపిక ** ప్రిన్సిపాల్ అబ్దుల్ ఖలీల్ **

Published: Thursday February 02, 2023

ఆసిఫాబాద్ జిల్లా ఫిబ్రవరి 1 (ప్రజాపాలన ప్రతినిధి) : జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల విద్యార్థులు జి వర్షిత్, ఎం అక్షిత, జిల్లాస్థాయి స్పెల్ విజార్డ్ పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ అబ్దుల్ ఖలీల్ బుధవారం తెలిపారు. మంగళవారం కాగజ్ నగర్ లో ఈ ఎల్ టి ఏ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో పాఠశాలకు చెందిన ఎనిమిదవ తరగతి విద్యార్థి గుండేటి వర్షిత్ ప్రథమ స్థానం, 9వ తరగతి విద్యార్థి ఎం అక్షిత ద్వితీయ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్టు ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపాల్, ఆంగ్ల ఉపాధ్యాయురాలు రేష్మ పర్వీన్, భాగ్యశ్రీ, అరుణ, పాఠశాల సిబ్బంది అభినందించారు.