అంగారంగా వైభవంగా డా: బీ.ఆర్. అంబెడ్కర్ 132 వ జయంతి మహోత్సవం

Published: Saturday April 15, 2023

జగిత్యాల, ఏప్రిల్ 14 (ప్రజపాలన ప్రతినిధి): జగిత్యాల పట్టణంలోని తహశీల్ చౌరస్తాలో భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డా: బీ.ఆర్. అంబెడ్కర్ విగ్రహానికి నాయకులు అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో 132వ జయంతి మహోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే డా: సంజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత అయిన ప్రపంచంలోనే అంబెడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ది అని ఎమ్మెల్యే అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ దళిత బహుజన బడుగు బలహీన వర్గాలకు నిరంతరం పోరాటం చేసి అహర్నిశలు కృషి చేసిన మహా జ్ఞాని అని ఆయన ఆశయాలను సాకారం చేయాలని ఆయన కోరారు. అధికారులు నాయకులు మాట్లాడుతూ అంబెడ్కర్ జయంతి మహోత్సవం కన్నుల పండుగలాగ ఉందాని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బి.ఎస్.లత సంయుక్త కలెక్టర్ మకరంద ఆర్డీవో మాధురి ఎస్సి కార్పొరేషన్ ఈడీ లక్ష్మీ నారాయణ మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్ ఉత్సవ కమిటీ కన్వీనర్స్ బండ శంకర్ బాలే శంకర్ దుమాల రాజ్ కుమార్ దుమాల గంగారాం బిరుదుల లక్ష్మణ్ కాయితి శంకర్ కారంగుల వసంతరావు నకుమల్ల లక్ష్మీనారాయణ చిత్తరి ప్రభాకర్ కొంగరి పవన్ అంబెడ్కర్ సంగం నాయకులు ధర రమేష్ కల్లెపల్లి దుర్గయ్య ఎండబెట్ల వరుణ్ కుమార్ బోనగిరి దేవయ్య మద్దెల నారాయణ సంపత్ దళిత బహుజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.