ఎమ్మెల్యే ఆనంద్ చిల్లర రాజకీయం మానుకో ఉద్యమ నాయకులపై దాడులు చేయిస్తే ఊరుకోం ఎమ్మెల్యే ఆనం

Published: Wednesday March 29, 2023

వికారాబాద్ బ్యూరో 28 మార్చి ప్రజాపాలన : ఎమ్మెల్యే ఆనంద్ చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని,ఉద్యమ నాయకులు,బిఅరెస్ నాయకుల పైన అనుచరులతో దాడులు చేయిస్తే తెలంగాణ ఉద్యమకారులు తిరగబడుతారని వికారాబాద్ మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ సనగారి కొండల్ రెడ్డి, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచంద్రారెడ్డి,రాష్ట్ర నాయకులు వడ్ల నందు,మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ చిగుల్లపల్లి రమేష్ తీవ్రంగా మండిపడ్డారు.మంగళవారం వికారాబాద్ పట్టణంలో నగేష్ గుప్తా గార్డెన్ లో బీఆర్ఎస్ నాయకులు,ఎమ్మెల్యే ఆనంద్ అసమ్మతి వర్గం వారు సమావేశం ఏర్పాటు చేసుకోగా దానిని ఎమ్మెల్యే ఆనంద్ అనుచరులు వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లను కూల్చి వేశారు.సమావేశాన్ని డిస్టర్బ్ చేశారు.దానిని నిరసిస్తూ వికారాబాద్ పట్టణంలోని మాజీ టీఎస్ఈ డబ్ల్యూఐడిసి చైర్మన్ నాగేందర్ గౌడ్ నివాసంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...ఎమ్మెల్యే ఆనంద్ వికారాబాద్ నియోజకవర్గ స్థాయిలో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని,ఉద్యమకారులను,సీనియర్ నాయకులను పక్కన పెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని,వారికే పదవులు అప్పగిస్తున్నారని విమర్శించారు. నగేష్ గుప్తా గార్డెన్ లో ఉద్యమకారులం,సీనియర్ నాయకులం కలిసి సాధక బాధలు తెలుసుకునేందుకు మాత్రమే సమావేశం ఏర్పాటు చేసుకున్నామని వివరించారు.కానీ అపార్థం చేసుకొని ఎమ్మెల్యే ఆనంద్ అనుచరులను పంపి గొడవలు సృష్టించారని అన్నారు.ఎమ్మెల్యే ఆనంద్ గొడవల మీద దృష్టి పెట్టకుండా అధిష్టానంతో మాట్లాడి నిధులు తేవాలని కోరారు.వికారాబాద్ మున్సిపల్ లో జోక్యం చేసుకొని కమిషనర్ కు,కౌన్సిలర్లుకు,చైర్పర్సన్ లకు మధ్య సిచ్చులు పెడుతున్నారని అన్నారు.పోలీసులను వారి ఇష్టారాజ్యంగా వాడుకొని కేసులు పెట్టిస్తున్నారని,సొంత పార్టీ నాయకుల మీదే కేసులు పెట్టించడం విడ్డురమన్నారు.ఎమ్మెల్యే ఆనంద్ కు వచ్చే ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీ నుంచి టికెట్ రాదని,వారి బావ అయ్యిన ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ అయ్యిన బిఎస్పీ పార్టీ నుంచి టికెట్ వస్తుందని,అందుకే పార్టీలో లొల్లి పెట్టి పార్టీ మారుదామని అనుకుంటున్నట్లు ఆరోపించారు. వచ్చే నెల 16న దారుర్ మండలంలో పెద్ద ఎత్తున్న భారీ సభ పెడతామని,ఎమ్మెల్యే ఆనంద్ కు చేతనైతే దానిని అడ్డుకోవాలని సవాల్ విసిరారు.ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున్న ఎమ్మెల్యే ఆనంద్ అసమ్మతి వర్గం నాయకులు పాల్గొన్నారు.