పీర్జాదిగూడ కార్పొరేషన్ అభివృద్ధి పనుల కోసం 3.75 కోట్లు కేటాయింపు

Published: Thursday July 01, 2021
మేడిపల్లి, జూన్ 30 (ప్రజాపాలన ప్రతినిధి) పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ అభివృద్ధి పనుల కోసం 3.75 కోట్లను సాధారణ సర్వ సభ్య సమావేశంలో ఆమోదించారు. మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో మేయర్ జక్క వెంకట్ రెడ్డి అధ్యక్షతన సాధారణ సర్వ సభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొని ఎజెండా అంశాలపై చర్చించి ఆమోదించారు.చర్చించిన అంశాలలో పట్టణ ప్రగతి పారిశుద్ధ్య నిర్వహణ, హరితహారం మెయిన్ రోడ్డుపై ఉన్న కరెంటు స్తంబాలను మార్చుట, కరోనాతో మరణించిన వారికి దహన సంస్కారాలకు గ్యాస్ క్రిమిటోరియం మరియు షెడ్ నిర్మాణం, సర్వే నెం.199 ప్రభుత్వ స్థలాన్ని బీరప్ప గుడి, అన్నపూర్ణ సత్రం & ఈద్గా నిర్మాణమునకు కేతయుంచుటకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపుట, వివిధ కాలనీలలో అవసరమున్నచోట కరెంటు స్తంభాల ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్స్ షిప్పింగ్, తెలంగాణ అమరవీరుల స్తూపం ఏర్పాటు, బస్ డిపో ముందర టాయిలెట్స్ తో కూడిన మోడ్రన్ బస్ స్టాండ్ నిర్మాణం వంటి అంశాలపై చర్చించి ఆమోదముద్ర తెలిపారు. ఈ సమావేశంలో కమీషనర్ ఎం.శ్రీనివాస్, తహసీల్దార్ అనిత, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, కార్పొరేటర్లు,కేతావత్ సుభాష్ నాయక్, బైటింటి శారద, బొడిగే స్వాతి, కోల్తూరు మహేష్, మాడుగుల చంద్రకళ, లెత్తాకుల మాధవి, బచ్చ రాజు, వీరమల్ల సుమలత, మద్ది యుగేందర్ రెడ్డి, అమర్ సింగ్, టి.ప్రసన్న లక్ష్మీ, పాషం శశిరేఖ, బండారు మంజుల, బండి రమ్య, కుర్ర షాలిని, అలువాల సరిత, పిట్టల మల్లేష్, భీంరెడ్డి నవీన్ రెడ్డి, ఎన్.మధుసూదన్ రెడ్డి, ఎంపల్ల అనంత్ రెడ్డి, దొంతిరి హరిశంకర్ రెడ్డి, పప్పుల రాజేశ్వరి, కో ఆప్షన్ సభ్యులు బొడిగే రాందాస్ గౌడ్, చెరుకు వరలక్ష్మి, చిలుముల జగదీశ్వర్ రెడ్డి, షేక్ ఇర్ఫాన్, నజియా, అధికారులు డి ఈ శ్రీనివాస్, మేనేజర్ జ్యోతి, జల మండలి డీజీఎం కార్తిక్ రెడ్డి, మున్సిపల్ ఏ ఈ వినీల్, టిపిఎస్ పావని, ట్రాన్స్ కో ఏ ఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.