శ్రీ వాల్మీకి ఆవాసంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Published: Monday June 21, 2021
జగిత్యాల, జూన్ 20 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్(గీతావిద్యాలయ ప్రాంగణం)లో సేవాభారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వాల్మీకి ఆవాసం (బాలుర వసతి గృహం)లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆవాస కమిటీ అధ్యక్ష కార్యదర్శులు జిడిగే పురుషోత్తం మరియు నందేల్లి మదన్ మోహన్ రావు తెలిపారు. గత 29 సంవత్సరాలుగా గ్రామీణ నిరుపేద దళిత విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న  శ్రీ వాల్మీకి ఆవాసంలో 2021- 22 విద్యా సంవత్సరానికి గాను పూర్వ కరీంనగర్ నిజామాబాద్ మరియు ఆదిలాబాద్ జిల్లాల నుండి 2వ తరగతి నుండి 7వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థులను చేర్చుకోవడం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులతో పాటు కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన వారు లేదా తల్లి లేదా తండ్రిని కోల్పోయిన వారికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. జూన్ 26 వరకు దరఖాస్తులు జగిత్యాలలోని శ్రీ వాల్మీకి ఆవాసంలో సమర్పించాలని కోరుతున్నారు. దరఖాస్తులను పరిశీలించి జూన్ 27న విద్యార్థులను ఎంపిక చేస్తామని ఎంపికైన విద్యార్థులకు ఉచిత వసతి భోజనము మరియు విద్యా సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 9989248893, 9494431893 నెంబర్లను సంప్రదించాలని నందేల్లి మదన్ మోహన్ రావు శ్రీ వాల్మీకి ఆవాసం-సేవాభారతి కార్యదర్శి జగిత్యాల వారు కోరారు.