బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన సర్పంచ్ మారెళ్ళ మమత..

Published: Tuesday September 27, 2022
తల్లాడ, సెప్టెంబర్ 26 (ప్రజాపాలన న్యూస్):
 తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామంలో బతుకమ్మ చీరలను గ్రామ సర్పంచ్ మారెళ్ళ మమత చేతులమీదుగా సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మమత మాట్లాడుతూ  దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ఆడపడుచులకు కానుకగా ఇవ్వాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ చీరలను పంపిణీ చేశారని తెలిపారు. అదేవిధంగా ఉత్సవాలను 11 రోజులపాటు వైభవంగా నిర్వహించేందుకు బతుకమ్మ ఆట, పాటలు తదితర కార్యక్రమాలు నేటి నుండి ప్రారంభమవుతాయన్నారు. ప్రజలు బతుకమ్మ ఉత్సవాల్లో  పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, ఎంపీటీసీ గోవిందు విజయమ్మ, ఉప సర్పంచ్ గోవిందు భాగ్యమ్మ,  సెక్రెటరీ వేణు, నాయకులు తుమ్మలపల్లి రమేష్, అంగన్వాడీ టీచర్లు, ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ యాకూబు పాషా, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.