బృహత్ పట్టణ పకృతి వనం, వైకుంఠధామం, క్రీడా ప్రాంగణాలను, ఏరియా గ్రౌండ్ ను సందర్శించిన... తెలంగాణ

Published: Saturday December 31, 2022
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని శివలింగాపురం బృహత్ పట్టణ ప్రకృతి వనాన్ని, వైకుంఠధామాన్ని, మణుగూరు  ఏరియా గ్రౌండ్ ను, అదేవిధంగా శేషగిరి నగర్  లో తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ రేగా కాంతారావు  పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, పలువురు అధికారులతో కలిసి వాటన్నిటిని వారి సందర్శించడం జరిగింది,
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు  మాట్లాడుతూ
పట్టణాలు పరిశుభ్రతతో పచ్చదనం పెరిగింది పల్లెలు, పట్టణాల అభివృద్ధి చెందుతున్న అన్నారు, అటవీ పునర్వ్యవస్థీకరణల భాగంగా అడవి ప్రాంతంలో విస్తృతంగా మొక్కలు నాటుదాంతో పాటు రక్షణ చర్యలు తీసుకోవడం వల్ల దట్టమైన అడవులుగా ఏర్పడుతున్నాయన్నారు, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా నర్సరీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని తెలిపారు గ్రామీణ ప్రజానీకానికి అహలదకరమైన వాతావరణంలో అందించడం కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలలో పల్లె ప్రగతి ప్రకృతి వనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు, గ్రామపంచాయతీలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్మాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి వనంలో మొక్కలు నాటాలని ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణంతోపాటు గ్రామాల్లో ఉన్న పిల్లలకి ప్రజలకి అందరికీ సౌకర్యం ఉంటుందని అన్నారు పల్లె పకృతి వనం ఉండటం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయని అన్నారు, రాష్ట్ర ప్రభుత్వం యువతను క్రీడలలో ప్రోత్సహించేందుకు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసిందన్నారు, యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని తగిన సమయం కేటాయించి ఉన్నతంగా ఎదగాలన్నారు ప్రతి గ్రామాల్లో క్రీడా ప్రాంగాలలో పార్కులను ఏర్పాటు చేసింది అన్నారు, క్రీడా రంగానికి రాష్ట్ర సర్కార్ పెద్దపీట వేస్తున్నదాని ఆయన అన్నారు, డంపింగ్ యార్డ్ రైతువేదికలను ప్రభుత్వం నిర్మించింది అన్నారు అనేక గ్రామాలలో ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందుతుందని ఆయన అన్నారు ప్రతిపల్లెకు రోడ్డు వందన నిర్మించాలని సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు రైతులకు పంట పెట్టుబడి సాయం చేయాలనే దృఢ సంకల్పంతో రైతుబంధు రైతు బీమా వాళ్లు చారిత్రక మొక్క పథకాలను సీఎం కేసీఆర్ గారి రూపకల్పన చేశారని అన్నారు పేదల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు రైతులకు నిరంతర కరెంటు అందించిన ఘనత సీఎం కేసీఆర్ గరిదని ఆయన అన్నారు సీఎం కేసీఆర్  ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలు దేశంలో ఎక్కడ ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయి అన్నారు,