వీఆర్ఏల నిరవధిక సమ్మెకు రేషన్ డీలర్ల మద్దతు

Published: Friday August 05, 2022

బోనకల్, ఆగస్టు 4 ప్రజా పాలన ప్రతినిధి:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వీఆర్ఏల సంఘం నిరవధిక సమ్మె గురువారానికి 11వ రోజు సందర్భంగా మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం నందు గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి నిరసన తెలిపారు. ఈ నిరవధిక సమ్మెకు తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ సుంకర రామరావు, జిల్లా ఉపాధ్యక్షులు బంధం అచ్చయ్య మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు ప్రకటించిన జీవో ను వెంటనే అమలు చేయాలని, వారి న్యాయమైన డిమాండ్లకు పరిష్కారం చూపించాలని, అర్హత కలిగిన వీఆర్ఏలందరికీ పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘం మండల అధ్యక్షులు తోట లింగయ్య, చిన్నబీరవల్లి రేషన్ డీలర్ బాలరాజు ,దారెల్లి సుందర్ రావు, పలువురు డీలర్లు పాల్గొని వారికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.