అర్,ఎస్,ఎస్, ఫాసిజాని కి వ్యతరేకంగా సదస్సు** సిపిఐ ఎంఎల్ రెడ్ స్టాప్ కార్యదర్శి తిరుపతి **

Published: Monday December 26, 2022
ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 25 (ప్రజాపాలన, ప్రతినిధి) : 
 జిల్లా కేంద్రంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఫాసిజానికి వ్యతిరేకంగా జాతీయ ప్రచారంలో భాగంగా కేంద్ర కమిటీ పిలుపుమేరకు సిపిఐ ఎమ్మెల్ రెడ్ స్టార్ పార్టీ జిల్లా కార్యదర్శి గోగర్ల తిరుపతి అధ్యక్షతనలో జిల్లా కేంద్రంలో ఆదివారం సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా గోగర్ల తిరుపతి మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ యూరప్ లో ఫాసిజం1920 సం లో వచ్చిందని,అదే కాలంలో మన దేశంలో ఆర్ఎస్ఎస్ ఏర్పడిందని,నల్ల చొక్కాలు వంటి అర్థ సైనిక అరాచక గుండాలకు శిక్షణ ఇచ్చిన  ఎడ్యుకేషన్ ఫాసిస్ట్ అకాడమీ 1937లో నాసిక్లో బోన్ సదా సైనిక పాఠశాలను ప్రారంభించరన్నారు. రాజకీయ సాధనంగా బిజేపీ కి జన్మనిచ్చిన ఆర్ఎస్ఎస్ ఆ గస్ట్1947 నుండి అర్థ శతాబ్దానికి పైగా నాగపూర్ ప్రధాన కార్యాలయంలో  ఎగురవేయడంమానేసిందని ఉన్నారు.భారత రాజ్యాంగాన్ని తిరస్కరించడంతోపాటు ఆ సమయంలో ఆర్ఎస్ఎస్ మనుస్మృతిని కూడా  ప్రతిపాదించింది, బి అర్ అంబేద్కర్ రూపొందించ బడిన రాజ్యాంగంను1949న నిషేధించాలని ఆర్ఎస్ఎస్ ప్రయత్నించిందన్నారు. డిసెంబర్ 25న ఆర్ఎస్ఎస్  ఫాసిజం సిద్ధాంతిక పునాది అయిన మనస్మృతిని దహనం చేసిన రోజు మనువాద హిందుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న రాజకీయ ప్రచారాన్ని అన్ని అభ్యుదయ ప్రజాస్వామ్య వర్గాలతో కలిసి లౌకిక దేశభక్తి కలిగిన ప్రజలు  కార్మిక వర్గం, అణగారిన వారందరినీ కోరుతున్నామన్నారు. ఈ సదస్సలో ఏబిఎం జిల్లా అధ్యక్షులు రాజేష్, నాయకులూ తిరుపతి, బహదూర్ షా, ప్రియాంక, అనీల్, డిబిపి జిల్లా అధ్యక్షుడు దయాకర్,అనిల్, లు పాల్గోన్నారు.