విద్యాలయాలు ఆధునిక దేవాలయాలు

Published: Tuesday March 14, 2023

శ్రీనిధి కాన్సెప్ట్ స్కూల్ కరస్పాండెంట్  అంజన బాబు మధిర రూరల్ మార్చి 13 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో సోమవారం శ్రీనిధి స్కూల్ కరస్పాండింగ్ బి అంజన బాబు ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో విద్యాలయాలు ఆధునిక దేవాలయాలు అని శ్రీనిధి కాన్సెప్ట్ స్కూల్ కరస్పాండెంట్ బి అంజన్ బాబు పేర్కొన్నారు  సోమవారం మండల పరిధిలోని ఆత్కూరు గ్రామ పరిధిలో ఉన్న శ్రీనిధి కాన్సెప్ట్ స్కూల్ నందు హ్యాపీ మదర్స్ ఫెస్ట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు  ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించి మాట్లాడుతూ కాలానుగుణంగా విద్యా వ్యవస్థలో జరుగుతున్న మార్పులను ఆయన చర్చించారు ప్రస్తుత సమాజంలో విద్యార్థులపై విద్య కంటే వ్యసనాలు పెనుభూతంలా మారి వారి ఏకాగ్రతను దెబ్బతీసేందుకు సిద్ధంగా ఉన్నాయని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వాటిని ఎదుర్కొని విద్యార్థులకు కుటుంబ బాంధవ్యాలు విద్యా విషయాలు వైపు వారి దృష్టి మళ్లించాలని తెలిపారు విద్యార్థి ఆలోచన విధానాన్ని ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సమన్వయం చేసుకుంటూ పరిశీలించాలన్నారు గత రెండు దశాబ్దాలుగా ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ విద్యావ్యవస్థలో మార్పులు పరిశీలిస్తూ  విద్యార్థుల మానసిక స్థితి గతి లకు అనుగుణంగా శ్రీనిధి విద్యాసంస్థలలో జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కార్పోరేట్ స్థాయి నాణ్యమైన విద్యను అందించేందుకు తమ వంతు బాధ్యతగా శక్తివంతన లేకుండా కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించి విద్యార్థులతో కలిసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు  డైరెక్టర్ చంద తదితరులు పాల్గొన్నారు