శ్రీనిధి పాఠశాలలో అంబరాన్నంటిన బాలల దినోత్సవ

Published: Tuesday November 15, 2022

సంబరాలు మధిర నవంబర్ 14 ప్రజా పాలన ప్రతినిధి మండలం పరిధిలో సోమవారం నాడుఆత్కూరు లోని *శ్రీనిధి* కాన్సెప్ట్ స్కూల్ నందు బాలల దినోత్సవ వేడుకలు  ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా సెల్ఫ్- గవర్నమెంట్ డే ని  నిర్వహించడం జరిగింది. విద్యార్థిని విద్యార్థులు ఒక్క రోజు అధ్యాపకులు గా బాధ్యతలు స్వీకరించారు, తదనంతరం అధ్యాపకులు గా బాగా రాణించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు అనంతరం పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను  ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో శ్రీనిధి విద్యాసంస్థల అధినేత బి. అంజన బాబు, ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, డైరెక్ట ర్లు, చందు, వెంకట నారాయణ, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.