వరుణార్చన - అభిషేక మహోత్సవం కొరకు నిర్మాణ పనులను పరిశీలిస్తున్న మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్

Published: Wednesday November 17, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 16 ప్రజాపాలన ప్రతినిధి : 22న ఇబ్రహీంపట్నం పెద్దచెరువులో నిర్వహించతలపెట్టిన వరుణార్చన - అభిషేఖహోమ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని తెరాస రాష్ట్ర యువనేత మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటీ) అన్నారు. మంగళవారం ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ శ్రేణులులతో కలిసి హోమం ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. పెద్ద చెరువులో పనులు చురుగ్గా కొనసాగుతున్నారు. యాగ స్థలం చదునుచేయించే పనులు, ఇప్పటికే పూర్తయ్యాయని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పదివేల మందికి భోజనం,తాగునీటి వసతి, సౌకర్యంతో పాటు పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గతంలో పెద్ద ఎత్తున ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలు, రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని, పెద్ద చెరువుతో పాటు నియోజకవర్గంలోని వివిధ చెరువులు నిండాలని వరుణయాగం, శత చండి యాగం పూజలు చేసిన విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు పెద్ద ఎత్తున నియోజకవర్గంలోని పెద్ద ఎత్తున చెరువులు నిండడంతో ఎమ్మెల్యే  మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో పదివేల మందితో ఈనెల 22న శుద్ధ కార్తీక సోమవారం రోజున పెద్దచెరువులో అత్యంత పవిత్రంగా నిర్వహించే కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలు, భక్తులు, పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, మున్సిపల్ అధ్యక్ష కార్యదర్శులు అల్వాల్ వెంకట్ రెడ్డి , మడుపు వేణుగోపాల్ రావు, యాచారం మండల పార్టీ అధ్యక్షులు కర్నాటి రమేష్ గౌడ్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ తెరాస పార్టీ యువత అధ్యక్షులు జెర్కొని రాజు, టిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అధ్యక్షులు నిట్టు జగదీశ్వర్, టిఆర్ఎస్ నాయకులు మంకాల దాసు, ఎంపీటీసీ ఏనుగు భరత్ రెడ్డి, విద్యార్థి యువజన నాయకులు బొట్టు ప్రవీణ్ నాయక్, పాతూరు రాజేష్ గౌడ్, సాయి, ముత్యాల వినోద్, గడ్డం శేఖర్ గౌడ్, గుజ్జ శ్రీకాంత్ రెడ్డి, విజయ్, కర్ణాకర్, సిద్ధం టిల్లు, మహేష్ మారాజు, వెంకటేష్ యాదవ్, రాజేందర్ యాదవ్, శ్రావణ్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.