ఎన్ ఆర్ జి ఎస్ సోషల్ ఆడిట్లో పాల్గొన్న రామచంద్రపురం ఎంపీటీసీ గాదె జయ. అశ్వాపురం (ప్రజా పాలన.)

Published: Friday December 23, 2022

ఎన్ఆర్ఈజీఎస్ సోషల్ ఆడిట్ సందర్భంగా జరిగిన గ్రామసభల్లో పాల్గొన్న ఎంపీటీసీ గాదె జయ.ఈ సందర్భంగా గాదె జయ మాట్లాడుతూ ప్రజలందరూ కూడా 100 రోజుల ఉపాధి హామీ పథకం అమలు మాత్రమే డబ్బులు వస్తాయని అంతకుమించి చేస్తే డబ్బులు వస్తాయా రావో అని వారు పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ఊరిలో హరితహారం లో భాగంగా ఎన్ని మొక్కలు నాటారు ఇంకా ఎన్ని మొక్కలు నాటాలి అనే దాని గురించి గత వారం రోజులుగా గ్రామంలో తిరుగుతూ వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగినది. మరియు ఇంకా ఎవరెవరు తీసుకోవాలి ఇంకా ఇంకుడు గుంటలు ఎంతమందికి రావాలి అనే దాని గురించి కూడా వివరాలు సేకరణ సేకరించడం జరిగినది ఈ కార్యక్రమంలో  రామచంద్రపురం సర్పంచ్ కాకా అశోక్ ,సెక్రటరీ  మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. అలాగే నెల్లిపాక సర్పంచ్ గుర్రుముచ్చు వెంకటరమణ సెక్రటరీ రాంకుమార్  మరియు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.