ఆలోచన లేని ఆవేశంతో తప్పులు చేసి శిక్షలు అనుభవించకండి : ప్రస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ప్రతిక్ స

Published: Sunday October 10, 2021
సారంగాపూర్, అక్టోబర్ 09 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మాండల్ పెంబట్ల గ్రామ పంచాయతీ ఆవరణలో కోర్టు చట్టాలపై ప్రస్ట్ క్లాస్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ ప్రతిక్ సింహా గ్రామ ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించారు. సమాజంలోని ప్రతి గ్రామంలో ఏదో ఒక అంశంలో ఆలోచన లేని ఆవేశంతో తప్పులు చేసి శిక్షలు అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవితం చాల సున్నితమైదని తప్పులు చేసి జైల్లో మగ్గుతు జీవితాన్ని మరియు కుటుంబాలను ఆగం చేసుకొని వీధిన పడవద్దని గ్రామ ప్రజలకు సూచించారు. పసిపిల్లలు మహిళలపై అత్యాచారాలు మాదక ద్రవ్యాలు సేవించడం మద్యం మత్తులో అతివేగంతో డ్రైవింగ్ చేయడం భూమి తగాదాలు తల్లిదండ్రులను పోషించక పోవడం తదితర అంశాలపై క్షుణ్ణంగా జడ్జి అవగాహన  కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొడ్డుపల్లి రాజన్న ప్యాక్స్ ఛైర్మన్ గుర్నాథమ్ మల్లారెడ్డి ప్రముఖ న్యాయవాదులు తాండ్ర సురేందర్ చంద్రమోహన్ బెత్తపు లక్ష్మణ్ ఎస్.పి సుబ్రహ్మణ్యం ఎర్ర నర్సయ్య రాజేశ్వర్ జున్ను రాజేందర్ ఐలయ్య ఆంజనేయులు రాజేష్ ప్రవీణ్ అంగన్వాడీలు రాజేశ్వరి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.