ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలి చేవెళ్ల నియోజకవర్గ:(ప్రజా

Published: Wednesday January 25, 2023

 

 

 
 కేంద్ర బొగ్గు గనులు భూగర్భ జలాల మంత్రివర్యుల కు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ  ఆదేశాల మేరకు..
మంగళవారం మొహినాబాద్ మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీజేపీ పార్లమెంటరీ నియోజకవర్గం సమావేశం సందర్భంగా  విచ్చేసినటువంటి పెద్దలు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు ప్రహ్లాద్ కుమార్ జోష్ ఎమ్మార్పీఎస్ శంకర్ పల్లి మండల ఇంచార్జి కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇస్తూ.. ఎస్సీ వర్గీకరణ కోసం తెలుగు నేలపై మాదిగలు 28 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న సందర్భంలో గల్లి నుంచి మొదలుకొని ఢిల్లీ వరకు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కు సంపూర్ణంగా బిజెపి పార్టీ మద్దతు తెలిపి. వంద రోజులలో వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి నేటికి ఎనిమిది సంవత్సరాలు గడిచిన వర్గీకరణ బిల్లు పార్లమెంటు లో ప్రవేశbపెట్టడం లో నిర్లక్ష్యం చేయకుండా ఈ ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో తక్షణమే వర్గీకరణ బిల్లును మదిగల కు ఇచ్చిన మాట ప్రకారంగా ప్రవేశ పెట్టే విధంగా చొరవ చూపి కేంద్ర పెద్దలు ప్రధానమంత్రి హోం శాఖ మంత్రులను ఒప్పించాల్సిందిగా కేంద్ర మంత్రి వర్యులను విజ్ఞప్తి చేయడం జరిగింది,
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మొహినాబాద్ మండల కన్వీనర్ రాజు మాదిగ.శంకర్ పల్లి మండల నాయకులు ఆసిగల్ల గండయ్య మాదిగ.శ్రీనివాస్ మాదిగ.MSF శంకర్ పల్లి మండలం కన్వీనర్ వంశీ  మాదిగ.మనోజ్ మాదిగ. తదితరులు పాల్గొన్నారు..