వరి సాగు చేసే రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి

Published: Saturday November 20, 2021
బోనకల్, నవంబర్ 19 ప్రజాపాలన ప్రతినిధి: దళిత గిరిజన బహుజన సాధికారత సంస్థ బోనకల్ ఆధ్వర్యంలో హైద్రాబాద్ లో లింగంపల్లి అంబేద్కర్ భవన్ దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇ సందర్భంగా దళిత గిరిజన బహుజన సాధికారత సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు గంధం పుల్లయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ రైతులను పట్టించుకోని పరిస్థితి నెలకొన్నది అని ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తెలంగాణ రైతాంగం తీవ్రంగా నష్ట పోయారని వారిని ఆదుకోవాల్సిన బాధ్యత తెరాస రాష్ట్ర ప్రభుత్వం పై వున్నదని వరి సాగు చేసిన రైతులను తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి అని అవసరమైతే వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రత్యేక నిల్వ కేంద్రాల్లో భద్రపరచాలి అని అన్ని విధాలుగా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్ధానికంగా వున్న రైతు బజార్లలో కూరగాయలు, పండ్లు, తృణ ధాన్యాలు అమ్ముకునే వ్యాపారస్తులు మరియు రైతులు పాల్గొన్నారు.