లేగదూడపై పెద్ద పులి దాడి

Published: Monday December 06, 2021
కాగజనగర్ , డిసెంబర్ 5, ప్రజాపాలన ప్రతినిధి : కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా లోని పెంచికల్పేట్ మండలం పోతెపల్లి గ్రామ శివారులోని అటవి ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. మేత కోసం వెళ్లిన పశువుల మందపై పెద్ద పులి ఒక్కసారిగా దాడి చేయడంతో లేగదూడకు తీవ్రమైన గాయాలయ్యాయి. తరచుగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో పెద్దపులిని పట్టుకొని వారికి రక్షణ కల్పించాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు.