పీర్జాదిగూడ కార్పోరేషన్లో మౌలిక వసతుల కల్పనకు కృషి

Published: Monday June 07, 2021
మంత్రి చామకూర మల్లారెడ్డి
మేడిపల్లి, జూన్ 6, (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు.కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ బీబీ సాహెబ్ మఖ్తలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మంత్రి వర్యులు చామకూర మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యేే బేతి సుభాష్ రెడ్డి మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్ హాజరై స్థానిక కార్పొరేటర్ లేతాకుల మాధవి రఘుపతి రెడ్డితో కలిసి శ్రీ శ్రీ నగర్ పార్క్ చుట్టూ ప్రహరి గోడ 14 లక్షల రూపాయల వ్యయంతో మరియు ఎస్.ఎన్ కాలనీలో 25 లక్షల వ్యయంతో సీ.సీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో కూడా అభివృద్ధి పనులను ఆపకుండా తగు జాగ్రత్తలతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి పార్లమెంటు టీఆర్ఎస్ ఇంఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి, పీర్జాదిగూడ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దర్గ దయాకర్ రెడ్డి, కార్పోరేటర్ కొల్తూరి మహేష్, నాయకులు కుర్ర శ్రీకాంత్ గౌడ్ మరియు డివిజన్ నాయకులు, అసోసియేషన్ సభ్యులు, కాలనీలోని పెద్దలు తదితరులు పాల్గొన్నారు.