దిక్కుతోచని స్థితిలో మధిర మెయిన్ రోడ్ చిరు వ్యాపారస్తులు

Published: Thursday February 25, 2021
మధిర, ఫిబ్రవరి 24, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మధిర మెయిన్ రోడ్డులో తలెత్తే ట్రాఫిక్ సమస్యలతో నేపథ్యంలో అధికారులు చేపట్టబోయే చర్యలతో మధిర మెయిన్ రోడ్ చిరు వ్యాపారస్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు గత 40 సంవత్సరాలుగా జీవనోపాధి నిమిత్తం మధిర మెయిన్ రోడ్డుకి ఇరువైపులా TVM స్కూల్ CPS స్కూల్ (గ్రంథాలయం రోడ్డు) ప్రభుత్వ ఆస్పటల్ తాసిల్దార్  కార్యాలయం కోర్టు మరియు టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంత పరిసర ప్రాంతాల్లో చిల్లర కొట్లు అయిన టైలరింగ్ షాపులు చెప్పులు కొట్టులు, బ్యాగులు ఎలక్ట్రికల్ షాపులు బటానీలు షిప్స్ చిల్లర కొట్టు తదితర చేతిపనులు చేసుకునే వాళ్లు డబ్బి కోట్లు ఏర్పాటు చేసుకున్న  జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారస్తులు. మధిర పట్టణం నియోజకవర్గ హెడ్ కోటర్ గా మరియు నగర పంచాయితీ నుండి మున్సిపాలిటీ అయిన నేపథ్యంలో ప్రతిరోజు మధిర మరియు మధిర ప్రాంత నుండి వేల సంఖ్యలో ప్రజలు విద్య వ్యాపారం మరియు రోజువారి పని నిమిత్తం వేలల్లో ప్రజలు వస్తూ వెళ్తూ ఉంటారు  వ్యాపార ప్రాంగణాలు కావటం చేత నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే మెయిన్ రోడ్ ట్రాఫిక్ సమస్యలు నెలకొన్న నేపథ్యం మున్సిపాలిటీ పాలకవర్గం మరియు అధికారులు రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న చిల్లర కొట్లు తొలగించాలని ఆలోచన చేస్తున్న నేపథ్యంలో మెయిన్ రోడ్డుకు ఇరువైపులా దాదాపుగా 200 కుటుంబాలు వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారు తమ దుకాణాలు తొలగిస్తే మా కుటుంబ పరిస్థితి ఏంటి అని తీవ్ర మనస్తాపం చెందుతూ దిక్కు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు ఈ సందర్భంగా చిరు వ్యాపారస్తుల సంఘం అధ్యక్షులు పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు మాట్లాడుతూ గత నలభై సంవత్సరాలుగా మేము ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న హఠాత్తుగా ఖాళీ చేయిస్తే మా బతుకులు రోడ్డున పడతాయి కరోనా నేపథ్యంలో చితికిపోయిన మా వ్యాపారాలు దాంతో అధికారులు చేపట్టబోయే చర్యల వల్ల మరీ అంత నష్టపోయి 200 కుటుంబాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ముందుగా చిరు వ్యాపారస్తులు కొరకు శాశ్వత పరిష్కార దిశగా నూతన దుకాణ సముదాయాన్ని లను సత్తుపల్లి కొత్తగూడెం మరియు ఖమ్మం వీధి వ్యాపారుల ప్రాంగణం ఏర్పాటు చేసిన విధంగా మధిర పట్టణంలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తర్వాతనే మెయిన్ రోడ్ విస్తరణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు