ఆధ్యాత్మిక చింతనే సమసమాజం నిర్మాణానికి పునాది

Published: Thursday December 09, 2021
పట్లూరు గ్రామ సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్
వికారాబాద్ బ్యూరో 08 డిసెంబర్ ప్రజాపాలన : ప్రతి ఒక్కరికీ ఆధ్యాత్మిక చింతన అలవడితే మనస్సుకు ప్రశాంతత చేకూరుతుందని పట్లూరు గ్రామ సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్ అన్నారు. బుధవారం మర్పల్లి మండల పరిధిలోని పట్లూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్ ఆధ్వర్యంలో గ్రామ దేవత ఊరడమ్మ దేవాలయం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని గ్రామ పెద్దల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా వారి వారి ఇష్ట దైవాలను స్మరించుకోవాలని సూచించారు. దైవ చింతన అలవడ్డవారికి ఇతరులకు ఎలాంటి హాని తలపెట్పరని విశ్వాసం వ్యక్తం చేశారు. దైవ చింతనతో మనస్సుకు ప్రశాంతత చేకూరడమే కాకుండా ఆరోజు కాగల కార్యాలన్నీ సకాలంలో పూర్తి అగుటకు ధైవానుగ్రహం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లు సురేష్ మహేష్, మాజీ సర్పంచ్ తుమ్మల సురేష్, వార్డ్ మెంబర్స్ నర్సిములు, బోహిని లాలయ్య, నర్సిములు, ప్రభు, సునీల్, సంగారెడ్డి, డైరెక్టర్ సంగయ్య, బాబురావ్, గజ్జల శంకర్, అంతుపటేల్, శ్రీశైలం, రాచయ్య, అశోక్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.