వర్షాకాలం తస్మాత్ జాగ్రత్త నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి డాక్టర్ వనిత సూచన

Published: Thursday June 09, 2022

 

కరీంనగర్ జూన్ 8 ప్రజాపాలన ప్రతినిధి :
 
వర్షాకాలం మొదలైందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని
గ్రామస్తులు  తమ వార్డులలో  మురికినీరు జమ కాకుండా,  ముందస్తు జాగ్రత్తలు ప్రభుత్వ వైద్యరాలు కోడం వనిత పిలుపు నిచ్చారు. గ్రామాల్లో ఆయా వీదులలో నీటిని నిల్వ ఉండకుండా జాగ్రత్తలు పాటించి వ్యాదులకు దూరంగా ఉండాలన్నారు. 
 తగు జాగ్రత్తలు తీసుకుంటే  వ్యాధులు ప్రబలకుండా  ఉంటుందని  వైద్యురాలు  కోరారు. కరీంనగర్ జిల్లా  మానకొండూరు మండలంలోని  కొండపలకల గ్రామంలో  బుధవారం నిర్వహించిన  పల్లె ప్రగతి లో భాగంగా  ప్రత్యేక అధికారి  మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో  మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా  వైద్యులు మాట్లాడుతూ  పరిసరాల పరిశుభ్రత  ప్రతి ఒక్కరూ పాటించాలని,  చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలని  ఆమె తెలిపారు.వైద్య శిబిరానికి వచ్చిన  ప్రజలకు  రక్తపోటు,  చక్కెర వ్యాధి,  చిన్న పిల్లలకు  వ్యాధి నిరోధక టీకాల తో పాటు  కోవిడ్ వాక్సినేషన్,  కార్బో వ్యాక్సినేషన్  టీకా  మందులను  వైద్య సిబ్బందికి వేయించారు.వైద్య శిబిరానికి హాజరైన  వ్యాధి గ్రస్తులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.  కంటి వైద్య నిపుణులు  వృద్ధులకు  కంటి పరీక్షలు నిర్వహించి  తగు మందులు అందజేశారు.  ల్యాబ్ టెక్నీషియన్   జ్వర పీడితుల  రక్తనమూనాలను  సేకరించి  వ్యాధి నిర్ధారణ కోసం  ల్యాబ్ కు తరలించారు.  ఈ వైద్య శిబిరానికి  మానకొండూరు ప్రాథమిక ఆరోగ్య  కేంద్రం  వైద్యురాలు కోడం వినత , డా క్టర్ అలేఖ్య ,  సూపర్వైజర్లు  కిషోర్, రాజు , సరోజ న , గ్రామ కార్యదర్శి హనీఫాద్దీన్ , కారోబార్ మల్లయ్య , ఏఎన్ఎయం లు నాయిని సంజీవ, అన్నపూర్ణ,  ఆశా వర్కర్లు  సరోజన,  సుజాత స్వాతి,  లావణ్య,  అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.