వికారాబాద్ పట్టణంలో హోళీ సంబరాలు

Published: Tuesday March 30, 2021
వికారాబాద్ జిల్లా ప్రతినిధి మార్చి 29 ( ప్రజాపాలన ): వికారాబాద్ పట్టణ పరిధిలోని ప్రజలు హోలీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గుంపులుగా చేరకుండా పోలీసుల ఆదేశాలను అనుసరిస్తూ భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించి సంబరాలు జరుపుకున్నారు. పండుగ వాతావరణాన్ని కరోనా ప్రభావంతో తగ్గినప్పటికీ మిగతా ప్రజలందరూ ఘనంగా హోలీ పండుగ నిర్వహించుకున్నారు. పట్టణ పరిధిలోని ప్రతి వీధిలో పిల్లలు పెద్దలు ఉషారుగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని కేరింతలతో హుషారుగా హోళీ ఆడుకున్నారు. ప్రకృతి సిద్ధంగా తయారైన రంగులతో హోలీ ఆడుకోవటంతో పర్యావరణానికి ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయని రంగులతో హోలీ సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు. హోలీ సంబరాలను సంతోషాల మధ్య జరుపుకోవడం విశేషం.