వాహనదారులు సకాలంలో పన్ను చెల్లించాలి

Published: Saturday February 25, 2023
* పన్ను చెల్లించని వాహనాలు 4,769.
* తనిఖీలో పట్టుబడితే రూ. 200 అదనపు అపరాధ రుసుము
* మార్చి 2023 వరకు పూర్తి పన్ను చెల్లించాలి
*  వికారాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి  వెంకట్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 24 ఫిబ్రవరి ప్రజాపాలన : వాహనదారులు సకాలంలో పన్ను చెల్లించాలని వికారాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి వెంకట్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 4,769 పన్ను చెల్లించని వాహనాలు తిరుగుతున్నాయని స్పష్టం చేశారు. అలాంటి వాహనాలు తనిఖీలలో పట్టుబడితే 200 రూపాయలు అపరాధ రుసుముతో మొత్తం 300 రూపాయలు పన్ను చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆయా వాహనాలకు సంబంధించి సుమారు 3,50,23,190 రూపాయలు పన్ను బకాయిలు ఉన్నాయని తెలిపారు. కావున వాహన యజమానులు సకాలంలో పన్నులు చెల్లించ గలరని రవాణా శాఖ అధికారి వెంకట్ రెడ్డి సూచించారు. రవాణా వాహనాల పన్నులు కోట్ల రూపాయలలో పేరుకుపోవడంతో ఉన్నత అధికారుల ఆదేశాలతో ప్రత్యేక తనిఖీలు ముమ్మరం చేశామని వివరించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రమాణ వాహన యజమానులు పన్నులు చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకు పోతున్నాయని గుర్తు చేశారు. మార్చి-2023 వరకు పూర్తి పన్ను బకాయలు వసూలు చేయాలనే లక్ష్యంతో వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పన్ను బకాయలు ఉన్న వాహనదారులు తమంతట తాముగా ఈ సేవ కేంద్రంలో పన్ను చెల్లిస్తే బకాయాలకు 50% శాతం అపరాధ రుసుముతో చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. వాహనదారులు తనిఖీలో పట్టుబడితే మాత్రం 200% శాతం రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తుందని అన్నారు.