నూతన దంపతులకు సైదులునాయక్ ఆశీర్వాదం...

Published: Tuesday April 26, 2022
కొనిజర్ల, ఏప్రిల్ 25 (ప్రజాపాలన న్యూస్): కొణిజర్ల మండలంలోని జంపాల నగర్ గ్రామానికి భూక్యా సకృ కుమారుడు రామారావు వివాహానికి వైరా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు బాదావత్ సైదులు నాయక్ సోమవారం హాజరయ్యారు. అదేవిధంగా ఉప్పలచెలక గ్రామంలో గుగులోతు రాజా కుమార్తె వివాహానికి ఆయన హాజరై నూతన వధూవరులకు అక్షింతలు వేసి దీవించారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గుగులోతు బాలు, గుగులోతు నాగేశ్వరరావు, సంతూ, నరసింహారావు, ధరావత్ మాన్సింగ్, భూక్య సంజీవ్ నాయక్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.