ప్రగతి భవన్. ముందు చాహొ రేహొ అంటున్న కాంట్రాక్టరు* *బిల్డింగ్ పనులు పూర్తయై రెండు సంవత్సరా

Published: Wednesday September 21, 2022

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో తాత్కాలిక తహశీల్దార్ భవనం నిర్మాణం చేసిన కాంట్రాక్టరు గండికోట దానయ్య చావే శరణ్యం అని అంటున్నాడు తహశీల్దార్ కార్యాలయం ఎదుట విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఉన్న తహశీల్దార్ భవనం కూల్చి అక్కడ కొత్త భవనం నిర్మాణం ఏర్పాటు చేయాలన్నా ఉద్దేశ్యంతో స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పక్కనే ఉన్న వసతి గృహం (గెస్ట్ హౌస్) భవనం నిర్మాణం పనులు చేయమని ఆదేశించరాని అన్నారు పోసిడింగ్ లేకుండా ఎలా పనులు చేయించారని తెలిపారు మంత్రి కేటీఆర్ తో ప్రారంభం ఉందని పనులు ముమ్మరంగా చేయించారని తెలిపారు ఆ భవనాన్ని తాత్కాలిక తహశీల్దార్ కార్యాలయంగా ఉపయోగిస్తున్నారని  యాభై లక్షలతో భవనం నిర్మాణం చేస్తే నిర్మాణం పూర్తి చేసి రెండు సంవత్సరాలు గడుస్తున్నా నిధులు మంజూరు చేయాలేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు అప్పులు తెచ్చి భవనం నిర్మాణం చేస్తే నిధులు మంజూరు కాకా తెచ్చిన అప్పులకు మిత్తిలు కట్టకుండా అప్పు ఇచ్చిన వలకు భయపడి నా కుటుంబనికి దూరంగా ఉండే పరిస్థితి ఏర్పడిందాని తెలిపారు  ఇప్పటికే ఒక్కసారి ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశానని నా కుటుంబం ఉండటం బ్రతికనని అన్నారు.
ఎమ్మెల్యే పనులు చేపించి నిధులు ఇవ్వకుండా ఒక కుంటుంబం రోడ్డున పడే పరిస్థితి ఉందని ఆయన అన్నారు. అధికారులను కలిసిన ఉపయోగం లేకుండా పోయిందాని తెలిపారు నిధులు మంజూరు చేసి కపడగలరాని ఎమ్మెల్యేను  కోరారు.