పొంగులేటి బాటలోనే మా ప్రయాణం.. అన్నారుగూడెం ఎంపీటీసీ గోవిందు విజయమ్మ తల్లాడ, మార్చి 6 (ప్రజా

Published: Tuesday March 07, 2023
 ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంటే తమ రాజకీయ ప్రయాణం ఉంటుందని తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామ ఎంపీటీసీ గోవిందు విజయమ్మ, శ్రీనివాసరావు దంపతులు పేర్కొన్నారు. సోమవారం కల్లూరు మండలంలోని నారాయణపురం పొంగులేటి స్వగ్రామంలో ఆయనను కలిసి వారు తాము మీ వెంటే  ఉంటామని అభయమిచ్చారు. ఈ సందర్భంగా పొంగులేటి వారిని  శాలువాలతో సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోపిషెట్టి వెంకటేశ్వర్లు, తుమ్మలపల్లి రమేష్, పొన్నం కృష్ణయ్య,   తదితరులు పాల్గొన్నారు.