షారోన్ ఆత్మహత్యకు సింగరేణి ఎస్టేట్స్ అధికారులకు సంబంధం లేద

Published: Saturday May 15, 2021
షారోన్ ఆత్మహత్యకు సింగరేణి ఎస్టేట్స్ అధికారులకు ఎటువంటి సంబంధం లేదని సింగరేణి అధికారుల సంఘం విడుదల చేసిన పత్రికా ప్రకటన ను తీవ్రంగా ఖండించిన భారతరత్న అంబేడ్కర్ సంక్షేమ సంఘం సింగరేణి అధికారు లా రా !  మనిషి జీవితం యొక్క విలువను మరణం యొక్క విలువను తెలుసుకొని మాట్లాడండి ! భారత రత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దెల శివ కుమార్ మరియు జిల్లా గౌరవాధ్యక్షుడు కూసపాటి శ్రీనివాస్ !
భద్రాద్రి, కొత్తగూడం జిల్లా, మే 14, ప్రజాపాలన ప్రతినిధి : ప్రభుత్వానికి ఎన్నో సంవత్సరాలుగా ఇంటిపన్ను కడుతూ కరెంటు బిల్లు కూడా కడుతున్న ఉద్యోగి సైమన్ తన ఇంటిని ఆనుకుని ఉన్న తనదైన కొద్ది పాటి ఖాళీ స్థలంలో కోతులు ప్రవేశించి బీభత్సం చేస్తున్నాయని చిన్న గోడను నిర్మించాలని ప్రయత్నిస్తే సింగరేణి ఎస్టేట్స్ అధికారిని స్వప్న మరియు సెక్యూరిటీ సిబ్బంది పలుమార్లు వెళ్లి సైమన్ ను బెదిరించి ఆ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేసి హతురాలు చిన్నారి షారోను తో వాగ్వివాదానికి దిగి ఆమెను మానసిక వేదనకు గురి చేసి సింగరేణి ఏరియా జిఎం నరసింహారావు సైమన్ పనిచేస్తున్న ఆర్టీసీ డిపో మేనేజర్కు ఈ విషయంలో లిఖితపూర్వక ఫిర్యాదు చేయడం షారోను ఆత్మహత్యకు ముందు తన సూసైడ్ నోట్ లో తన మరణానికి సింగరేణి స్టేట్స్ అధికారిని స్వప్న మరియు సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది అని రాయడం కళ్ళకు కనిపిస్తున్నా షారోన్ ఆత్మహత్యకు సింగరేణి ఎస్టేట్ అధికారుల సంబంధం ఏమీలేదని సింగరేణి కొత్తగూడెం అధికారుల సంఘం అధ్యక్ష ఉపాధ్యక్షులు పాలడుగు శ్రీనివాస్ మరియు బుడగం రామకృష్ణ పత్రికా ప్రకటనలు ఇవ్వడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని నేరానికి మద్దతు పలుకుతూ నేరస్తులను వెనక వేసుకోస్తూ తిరిగి షారోన్ కుటుంబానికి ఇంకా మానసిక వేదనకు గురి అన్నట్లుగా అసత్య ప్రకటనలు చేస్తున్న పాలడుగు శ్రీనివాస్ మరియు బుడగం రామకృష్ణ పై కూడా కేసులు నమోదు చేయాలని స్వర్గీయ షారోన్ న్యాయ సాధన నిజనిర్ధారణ ఐక్య వేదిక సభ్యులు కూడా అయిన మద్దెలశివ కుమార్ మరియు కూసపాటి శ్రీనివాసులు డిమాండ్ చేశారు 14 05 2021 నాడు స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద గల సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణి అధికారులు నాలుగు గోడల మధ్య లెగ్ ఆర్ కోళ్ళ వలె ఒక నిర్దిష్ట టెంపరేచర్ లోనూ ఒక నిర్దిష్ట టెంపర్ మెంట్ తోనూ మానవ సంబంధాలు లేకుండా సామాజిక స్పృహ లేకుండా రోబో లాగా పనిచేసేవారని అటువంటి వారికి ఒక జీవితం యొక్క విలువ ఒక మరణం యొక్క విలువ ఏం తెలుస్తుంది అని వారు ఎద్దేవా చేశారు రాజకీయ పలుకుబడి అధికార పలుకుబడి ధన సంపద పలుకుబడి గలవారు సింగరేణి స్థలాలలో ఎన్నో పెద్దపెద్ద వ్యాపార నివాస నిర్మాణాలను కట్టడం జరిగిందని లక్షలు కోట్లు ఆర్జించడం జరుగుతున్నదని అటువంటి పెద్దలను ఏమి అనడం చాతగాని ఈ సింగరేణి అధికారులు సైమన్ లాంటి పేద వర్గాలకు దళిత వర్గాలకు చెందిన వారిని బెదిరించడం వారిని భయభ్రాంతులకు గురి చేయడం వారికి అన్యాయం జరిగిందని అనాదిగా సాగుతున్న అమానుషమని దీనిని ప్రజాస్వామ్యవాదులు అభ్యుదయవాదులు సామాజిక సేవా దురంధరులు తీవ్రంగా ఖండించాలని వారు పిలుపునిచ్చారు స్వర్గీయ షారోన్  ఆత్మహత్యకు సార్ధకత గా ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు దురహంకార దుర్మార్గ స్వార్థపూరిత సింగరేణి అధికారులకు శిక్షలు పడేంత వరకూ ఈ JAC పోరాటం ఆపదని షారోన్ మరణం ఈ సమాజానికి ఒక సందేశాన్ని అందించాలని భవిష్యత్తులో పేద కార్మిక వర్గాలకు న్యాయం జరిగే టట్లుగా ఈ పోరాటం కొనసాగుతుందని వారు ఉద్ఘాటించారు హైదరాబాదు నుండి జాతీయ ట్రేడ్ యూనియన్ నాయకులు మరియు జాతీయ అంబేద్కర్ సంఘాల సమాఖ్య అధ్యక్షులు శ్రీ గొల్లపల్లి దయానంద్ రావు షారోన్ దురదృష్ట మరణానికి తన ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ సారో న్యాయ సాధన ఐక్యవేదిక లో తాను కూడా భాగస్వామిని అవుతానని హామీ ఇచ్చారు ఈ అత్యవసర సమావేశంలో మద్దెల మరియు కూసపాటి శ్రీ గొల్లపల్లి దయానంద రావు లతోపాటు  సంఘ నాయకులు మంద హనుమంతు సబ్బవరం మధుసూదన్ చిన్ని కోలపూడి ధర్మరాజు అంతోటి పాల్ బొంకూరి పరమేష్ ప్రముఖ న్యాయవాది అభ్యుదయవాది అబ్దుల్ రజాక్ ఉప సర్పంచ్ దుర్గేష్  మహేష్ ప్రిన్సిపాల్ దేవీలాల్ అంతోటి రాజు మహిళా నాయకురాళ్లు బడి కల పుష్పలత జోగు రమాదేవి కో దురుపాక మీనాక్షి నక్క సృజన మాట్లగాయత్రి కృపా వేణి మంద చంద్రకళ తదితరులు పాల్గొన్నారు