ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 20 ప్రజాపాలన ప్రతినిధి *ఈనెల 23న చలో రామోజీ ఫిల్మ్ సిటీ* *రామోజీ ఫిలిం

Published: Monday November 21, 2022

భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) సిపిఎం ఆధ్వర్యంలో 2007లో రామోజీ ఫిలింసిటీలో భూపోరాటం చేసిన ఫలితంగా నాగన్ పల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 189 మరియు 203లలో దాదాపు 670 మందికి పేదలకు ఇంటిస్థలం సర్టిఫికెట్లు ఇచ్చారు. సర్టిఫికెట్లు వచ్చిన లబ్దిదారులు, ఇంటి స్థలం లేని పేదలతో రాయపోల్ శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్ లో సమావేశం నిర్వహించటం జరిగింది.

ఈ సందర్భంగా *సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్ వెస్లీ గారు* మాట్లాడుతూ... 2007లో సిపిఎం పార్టీ నాయకత్వంలో పోరాడి దాదాపు 670 మందికి ఇంటిస్థలం సాధించామని, ఈ పోరాటంలో దాదాపు పది సంవత్సరాలు కేసులు కోర్టుల చుట్టూ తిరిగామని, ఇంటి స్థలం సర్టిఫికెట్ తో పాటు ఈ భూమిలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చిందని గుర్తు చేశారు, కానీ పేదలను ఈ స్థలం పైకి రానివ్వకుండా రామోజీరావు అడ్డుకుంటున్నారు, 60 గజాల చొప్పున ఇంటి స్థలం కేటాయించి హద్దులు పెట్టిన గుర్తులను కూడా చెరిపేస్తున్నారు, పేదలకు ఇచ్చిన ఇండ్ల స్థలాల్లోనే సినిమా షూటింగ్లకు సెట్టింగ్లను ఏర్పాటు చేస్తూ స్థలాన్ని మొత్తం ఆక్రమిస్తున్నారు.  ఇటువంటి అక్రమాలను ప్రభుత్వం దృష్టికి స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే, అధికారులు రామోజీరావుకు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు, ప్రజలను ఈ భూముల్లోకి రాకుండా గేట్లను ఏర్పాటు చేసి అడ్డుకుంటున్నారు,  వెంటనే పట్టాలిచ్చిన పేదలందరికీ స్థలాలు చూయించి ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయల సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం, కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకొని పేదల ఇండ్ల స్థలాలు కోసం కేటాయించిన భూమిలో రామోజీరావు నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాం,  చుట్టుపక్కల గ్రామాల ప్రజలను కదిలించి ఇళ్ల స్థలాలలో ఇంటీ నిర్మాణ కార్యక్రమాన్ని మేమే దగ్గరుండి చేపడతామని హెచ్చరించారు. అందులో భాగంగానే ఈనెల 23న బుధవారం ఉదయం 9:00గంటలకు  రాయపోల్ గ్రామం నుంచి రామోజీ ఫిలిం సిటీ వరకు ర్యాలీగా వెళ్తామని చెప్పారు.

*సిపిఎం జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్  మాట్లాడుతూ.అది పేదలకు చెందిన భూమి ప్రభుత్వమే దగ్గరుండి పేదలకు ఇంటి స్థలాలు కోసం కేటాయించింది. ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇంటిని కూడా మంజూరు చేసింది. రామోజీరావు ప్రభుత్వంలో తమ పలుకుబడిని ఉపయోగించి పేదల భూములను ఆక్రమిస్తున్నారు ఇది సరైనది కాదు.  అది ముమ్మాటికీ పేదలకు దక్కాల్సిన భూమి. కాబట్టి ఇంటి స్థలాల కోసం జరిగే ర్యాలీలో ప్రజలు పెద్దయెత్తున పాల్గోనలని పిలుపునిచ్చారు.
ఈకార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బి సామెల్, మండల కార్యదర్శి సిహెచ్ జంగయ్య, మండల కార్యవర్గ సభ్యులు పి.జగన్, బుగ్గ రాములు, లింగస్వామి, మండల కమిటీ సభ్యులు ఏ.వెంకటేష్ సిహెచ్ నరసింహ, ఎం.ఆనంద్, కాకి రమేష్ రైతు సంఘం నాయకులు సిహెచ్.ముసలయ్య, ఎం.రామకృష్ణారెడ్డి, యాదగిరి సీపీయతదితరులు పాల్గొన్నారు,