వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Published: Tuesday November 30, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 29 ప్రజాపాలన ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మద్దతు ధర ఏ గ్రేడ్ 1960, బి గ్రేడ్ 1940తో ఇబ్రహీంపట్నం మండలం వెలిమినేడు గ్రామంలో కొనుగోలు కేంద్రాన్నీ మంగళ పల్లి పటేల్ గూడా సహకార సంఘం చైర్మన్ మంచిరెడ్డి మహేందర్ రెడ్డి సోమవారం ప్రారంభించడం జరిగింది. ఐకెపి కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యాన్ని తరలించడంతో రైతులకు ఖర్చు మిగిలి మద్దతు ధరతో లాభాలు పొందవచ్చని చైర్మన్ అన్నారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ మంచి రెడ్డి మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ రవీందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, సహకార సంఘం డైరెక్టర్ లు మెట్టు శ్రీనివాస్ రెడ్డి, డి.యాదయ్య, జమ్మూ శ్రీశైలం, పల్లె శ్రీకాంత్, డోకురి లింగ రెడ్డి, డోకురి శ్యామ్ సుందర్ రెడ్డి, తొట్ల యాదమ్మ, బూడిద బాల్ రెడ్డి, నిట్టు యాదమ్మ, మక్కపల్లి అంజయ్య, తదితరులు పాల్గొనడం జరిగింది.