మత్స్యకారుల హక్కులకై ఉద్యమిద్దాం

Published: Tuesday August 24, 2021
టి ఎం కె ఎం కె ఎస్  జిల్లా ప్రధాన కార్యదర్శి  గోరెంకాల నర్సింహ్మ
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 23, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం TMKMKS సభ్యత్వ కార్యక్రమం సోమవారం ఇబ్రహీంపట్నం మండలం దండు మైలారం గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సంఘం జిల్లా అధ్యక్షులు చనమోని శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోరెంకల నర్సింహ్మా అధ్వర్యంలో గ్రామ సర్పంచ్ రావనమోని మల్లీశ్వరి భర్త రావనమోని జంగయ్య, ఎం పి టి సి పిట్టల అనసూయ భర్త సీతయ్య, సంఘం మండల అధ్యక్షులు రావనమోని రాజు కు సోసైటి డైరెక్టర్లకు సభ్యత్వం ఇచ్చి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ సంఘం ఏర్పడి 20 సం, రాలు కావుస్తుందని అప్పటి నుండి ఇప్పటివరకు రాష్ట్ర వ్వాప్తంగా అనేక ఉద్యమాలు నిర్మించమని ప్రధానంగా జిల్లాలో చెరువులు కుంటలను భుకబ్జాదారుల నుండి రక్షించాలని, చెరువులు కుంటలపై పూర్తి హక్కులు మత్స్యకారులకే ఉండాలని, ప్రతి మత్స్యకార సొసైటీకి 10 లక్షల రూ 100 శాతం సబ్సిడీతో రుణాలు ఇచ్చి అదుకోవాలని, మత్స్యకారులకు ఉచితంగా నాణ్యమైన 3 అంగుళాల చేప పిల్లలను ఉచితంగా ఇవ్వాలని, ప్రతి గ్రామంలో మత్స్యకారులకు కమ్యూనిటీ హాల్ నిర్మించాలని, అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసిన ఫలితంగా ఇప్పుడు కొన్నింటిని మాత్రమే సాధించుకున్నగాని, ఇంకా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి అన్నారు. అందులో ప్రధానంగా ప్రభుత్వం ఎన్నికల ముందు మాత్రమే తాయిలాలు ప్రకటించి నట్లు ఐదు సంవత్సరాల ఒక్క సారి మత్స్యకారులకు ఎర వేస్తున్నారని ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు. అలా కాకుండా ప్రతి సంవత్సరం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, ఎన్ సి డి సి ద్వారా రెండో విడత మత్స్యకారులకు సంక్షేమ పథకాలు అందజేయాలని, ప్రతి సొసైటీ సభ్యునికి మోటార్ సైకిళ్ళు ఇవ్వాలని,ప్రతి మండల కేంద్రంలో 25 లక్షల రూ వ్యయంతో చేపల మార్కెట్ నిర్మించాలని,50 సంవత్సారాలు నిండిన ప్రతి మత్స్యకారుడికి వెంటనే పించను ఇవ్వాలని,సహజంగా మరణించిన మత్స్యకారులకు 6లక్షల రూ ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, వయస్సు పరిమితి 60 సంరాల వరకు పెంచాలని, కరోనాలో భారీగా నష్టపోయిన మత్స్యకారులను ఆదుకోవడానికి ప్రతి కుటుంబానికి పదివేల రూపాయలు 6 నెలలు పాటు ఆర్థిక సాయం చేయాలని, నూతన మత్స్య సొసైటీల కోసం దరఖాస్తు చేసుకున్న వాటిని వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని, డిమాండ్ చేసారు. ఈ సమస్యలపై భవిష్యత్తులో అనేక ఉద్యమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షులు రావనమోని రాజు, రావనమోని బుగ్గ రాములు, ముత్యాలు, సత్తయ్య, మండల నాయకులు జి.కుమార్, గ్రామ కమిటీ అధ్యక్షులు యాట శంకర్, కార్యదర్శి పొన్నల శ్రీనివాస్,  రావనమోని రాజు పాల్గొన్నారు.