మధిర మున్సిపాలిటీలో స్వైర విహారం చేస్తున్న పందులు.. పట్టించుకోని అధికారులు

Published: Tuesday July 20, 2021
మధిర, జులై 19, ప్రజాపాలన ప్రతినిధి : అయ్యా మా గోడు వినండిపందుల బెడద నుంచి ప్రజలను కాపాడాలని సిపిఐ పట్టణ కార్యదర్శి బెజవాడ రవి డిమాండ్మున్సిపాలిటీ లో పందులు స్వైర విహారం చేస్తున్నా సంబంధిత పాలకులు, అధికారులు పట్టించుకోవడంలేదని సిపిఐ మధిర పట్టణ కార్యదర్శి బెజవాడ రవి విమర్శించారు. అసలే కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న తరుణంలో వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే నేపథ్యంలో పట్టణంలో పందులు విచ్చలవిడిగా తిరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ఆయన అన్నారు. ప్రజా ప్రతినిధులకు, అధికారులకు ప్రజలు రాజకీయ పార్టీలు ఉద్యోగ మేధావులు ఎన్నోసార్లు విచ్చలవిడిగా తిరుగుతున్న పందుల విషయంలో మోరపెట్టుకున్నా, పత్రికా విలేకరులు తమవంతుగా సమస్య తీవ్రతను మున్సిపాలిటీ దృష్టికి తీసుకొస్తున్నా ఎందుకు పరిష్కరించలేక పోతున్నారో అర్ధంకావడంలేదని అన్నారు. గట్టిగా ప్రజలనుంచి వత్తిడి వస్తే మొక్కుబడిగా నాలుగు పందులను పట్టడం ఇక మధిరలో పందులులేకుండా చేస్తాం అని వాటిముందు నిలబడి ఒక ఫోటో దిగడంతో పని అయిపోయిందా అని విమర్శించారు. మున్సిపాలిటీ పరిధిలోని రైతులు వేసే నారుమడులు సైతం నాశనం చేస్తున్నాయని రైతులు షోషల్ మీడియా ద్వారా వాట్సాప్ గ్రూప్ లద్వారా తెలియజేసినా పట్టించుకునేనాధుడు కూడా లేకపోవడం సిగ్గుచేటని, ఒకపక్క కరోనా భయం మరోపక్క వర్షాకాలం సీజనల్ వ్యాధుల భయంతో పట్టణ ప్రజలు అల్లాడుతుంటే విచ్చలవిడిగా తిరిగే పందులతో ఇంకేరోగాలు వస్తాయో అని భయంతో వణుకుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ లోని ప్రజాప్రతినిధులు, అధికారులు పందుల సమస్యను త్వరగా పరిష్కారించాలని లేకుంటే భాదిత ప్రజలను సమీకరించి మున్సిపాలిటీ ముట్టడి చేస్తామని అధికారులను హెచ్చరించారు.