*వాసవి మెడికల్ ఏజెన్సీ ఆధ్వర్యంలో రక్తదానం*

Published: Friday March 10, 2023

మంచేయల టౌన్, మార్చి 09, ప్రజాపాలన: వాసవి మెడికల్ ఏజెన్సీ ఆధ్వర్యంలో గురువారం  పట్టణంలోని రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేశారు. కొత్త శ్రీనివాస్ జ్ఞాపకార్థం ఈ రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకురాలు కొత్త మాధురి అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్ చందూరి మహేందర్ , కోశాధికారి రవీందర్ మాట్లాడుతూ  కొత్త శ్రీనివాస్ జ్ఞాపకార్థం రక్తదానం చేసినందుకు గర్విస్తూ మునుముందుగా ఇలాంటి రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తూ తల సేమియా పిల్లలకు సహాయాన్ని అందించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. రక్తదానం చేసి మరొకరికి ప్రాణదాత  కావచ్చు అని, ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు అని అన్నారు. రక్తదానం చేసిన వారిలో జంగపల్లి రమేష్, మ్యాన రాజేంద్రప్రసాద్, అంకతి భాను చందర్, సురేందర్, రవి తదితరులు పాల్గొన్నారు.