గొర్రెలు మేకలకు ఉచిత నట్టల నివారణ కార్యక్రమం కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ మర్రి తి

Published: Friday March 03, 2023
బోనకల్, ఫిబ్రవరి 2 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని ఆళ్లపాడు గ్రామంలో గురువారం గొర్రెలు, మేకలకు ఉచిత నట్టల నివారణ మందులు గ్రామ సర్పంచ్ మర్రి తిరుపతిరావు చేతులు మీదుగా ప్రారంభించారు. గొర్రెలకు, మేకలకు నత్తల నివారణ మందులు తాగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యాదవ సోదరులు మర్రి నాగేశ్వరావు, మర్రి రామారావు, పదిలం నరసింహారావు, దొంతేబోయిన సురేష్ , పశు వైద్య సిబ్బంది లైవ్ స్టాక్ అసిస్టెంట్ నాగేంద్ర కుమార్, శ్రీకాంత్, గ్రామ గోపాలమిత్ర అశోక్, నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.