పార్టీ అభివృద్దే మన ముందున్న లక్ష్యం

Published: Tuesday September 07, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 6, ప్రజాపాలన ప్రతినిధి : ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సూచన మేరకు ఈరోజు ఉప్పరిగూడ, పోచారం, రాయిపోల్ గ్రామాల్లో లో గ్రామ టిఆర్ఎస్ పార్టీ నూతన కమిటీ ఎన్నిక సోమవారం జరిగింది. ముఖ్య అతిథులుగా ఇబ్రహీంపట్నం ఎంపీపీ పి.కృపేష్, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సర్పంచ్ బూడిద రామ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధితో పాటు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కృషితో అనేక విధాలుగా అభివృద్ధి చెందుతుందని, అన్నారు రానున్న రోజులో. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ గ్రామాలలో మరింత బలోపేతం చేసి పార్టీ అభివృద్ధికి మరింత కృషి చేయాలని  కార్యకర్తలకు ఆయన సూచించారు. నూతనంగా ఎన్నుకోబడిన గ్రామ కమిటీ సభ్యులు, తెరాస పార్టీ శ్రేణులు, రాష్ట్ర సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలలోకి మరింత తీసుకెళ్లాలని కోరారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగిందని, పార్టీ కార్యకర్తలే తెలంగాణ రాష్ట్ర సమితి బలం అని  తెలిపారు. అనంతరం గ్రామ తెరాస పార్టీ నూతన కమిటీని ఎన్నికల పరిశీలకులు పిఎసిఎస్ చైర్మన్ మంచిరెడ్డి మహేందర్ రెడ్డి, ఓయూ ఉద్యమ నాయకులు మంద సురేష్, మాజీ సర్పంచ్ కొంగర బీరప్ప, చీమల జగన్తమ్, పొన్నాల జగదీష్ ముదిరాజ్, తదితరులు ఆయా గ్రామల కమిటీలకు ఎన్నికల ఇన్చార్జిగా వ్యవహరించి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఉప్పరిగూడ నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా నలొల్ల రమేష్, ఉపాధ్యక్షుడు మడుపు శ్రీశైలం, కార్యదర్శి బొడుసు వెంకటేష్ యాదవ్, పోచారం గ్రామ  అధ్యక్షులుగా గోరిగే రమేష్, ఉపాధ్యక్షులుగా బి.వినోద్ కుమార్ కార్యదర్శి దేవరకొండ మహేష్, రాయపోల్ అధ్యక్షులుగా డొంకని బాలు గౌడ్, ఉపాధ్యక్షుడు మంత్రి ఆంజనేయులు, కార్యదర్శి చింతల నవీన్ రెడ్డి తదితరులు ఎన్నికైనారు. ఈ కార్యక్రమంలో  రైతు సంఘం అధ్యక్షులు అధ్యక్షులు మొద్దు అంజి రెడ్డి, ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షుడు ఏనుగు భరత్ రెడ్డి, నాయకులు మంకాల దాస్, జి శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్వి వి.వి జిల్లా నాయకులు నిట్టు జగదీశ్వర్, సర్పంచ్ బల్వంత్ రెడ్డి, ఎంపీటీసీ అచ్చన శ్రీశైలం, జ్యోతి భాస్కర్ రెడ్డి, ఉప సర్పంచ్లు భగీరథ సాగర్, బూడిద నరసింహారెడ్డి, ఆచన బాలరాజు, నర్సింహా, శేఖర్, గోపాల్, గొరిగే, కృష్ణ, ఆయా గ్రామాల్లో ముఖ్యనాయకులు తదితరులు పాల్గొన్నారు.